https://oktelugu.com/

జేసి రెడ్డప్ప పని పడుతున్న జగన్. వ్యాపారాలను దెబ్బతీయడమే టార్గెటా?

గత 16 నెలలుగా సైలెంట్‌గా ఉండిపోయిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష నేతల మీద పడింది. ఒక్కొక్కరిగా టార్గెట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డికి పెద్ద షాక్‌ ఇచ్చింది. జేసీ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్‌పై కేసు నమోదు చేసింది. మైనింగ్ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన అధికారులు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 10:18 AM IST
    Follow us on

    గత 16 నెలలుగా సైలెంట్‌గా ఉండిపోయిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష నేతల మీద పడింది. ఒక్కొక్కరిగా టార్గెట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డికి పెద్ద షాక్‌ ఇచ్చింది. జేసీ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్‌పై కేసు నమోదు చేసింది. మైనింగ్ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన అధికారులు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆయన పేర్కొన్నారు. కాగా, జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే ఆయన మైనింగ్ క్వారీలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం గమనార్హం.

    Also Read: న్యాయవ్యవస్థతో జగన్ ఢీ.. మతలబేంటి? ఏం జరుగనుంది?

    జేసీ మైనింగ్‌ సంస్థల్లో కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరలేదనే విమర్శలు వస్తున్నాయి. దివాకర్‌రెడ్డి రెండు క్వారీల్లో నిబంధనల ఉల్లంఘించారని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు చెబుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని చెప్పారు.

    జేసీ మైనింగ్‌ సంస్థలపై ఆరోపణల నేపథ్యంలో ఇటీవల తాడిపత్రిలోని గనుల శాఖ కార్యాలయానికి జేసీ స్వయంగా వెళ్లారు. అయితే.. ఆ సమయంలో అక్కడ మైన్స్‌ ఏడీ లేరు. దీంతో దివాకర్‌రెడ్డి వెనుతిరిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నేను వస్తున్నానని తెలుసుకొని మైన్స్‌ ఏడీ పరారయ్యారు. మా జీవనాధారం గనులే.. నా కడుపు కొట్టకండి. 8 జీపుల్లో వచ్చి మా గనులను తనిఖీ చేయడంలో ఆంతర్యం ఏంటి? మా గనుల్లో నక్సలైట్లు ఏమైనా ఉన్నారా? మా తమ్ముడిని టార్గెట్ చేశారు. ఇప్పుడు నన్ను చేస్తున్నారు. మా ప్రభుత్వం వస్తే మేం కాదు.. మా కార్యకర్తలు అధికారులను వదలరు. పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీకి ఊడిగం చేయొద్దు. పోలీసులు ఇంత బానిస బతుకు ఎందుకు బతుకుతున్నారు.కాలం మారుతుంది జాగ్రత్త’ అని జేసీ దివాకర్ రెడ్డి హెచ్చరించారు.

    Also Read: హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ సర్కార్ సంచలన వ్యాఖ్యలు..?

    గతంలోనూ యాడికిలోని దివాకర్‌‌రెడ్డికి చెందిన త్రిశూల్‌ సిమెంట్‌ కంపెనీ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలోని.. సున్నపు రాతి గనుల లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిమెంట్‌ తయారీ ప్లాంట్‌ నిర్మాణానికి ఐదేళ్ల గడువు పొడిగిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. 38,212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ చేపడుతామని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.