తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

నిన్నటి కేబినెట్‌ మీటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో మంత్రిమండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగంపై సమగ్రంగా చర్చించిన కేబినెట్‌ ఈసారి కూడా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది. రాబోయే సీజన్‌లో రాష్ట్రంలో సాగయ్యే మొక్కజొన్నపైనా కేబినెట్‌ చర్చించింది. వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అదేవిధంగా మొక్కజొన్న దిగుమతులపై సుంకాలు తగ్గించడం వంటి చర్యలతో రాష్ట్రంలో […]

Written By: NARESH, Updated On : October 11, 2020 10:53 am

Will KCR end corruption with the new Revenue Act..?

Follow us on

నిన్నటి కేబినెట్‌ మీటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం దాదాపు 4 గంటల పాటు కొనసాగింది. ఈ భేటీలో మంత్రిమండలి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగంపై సమగ్రంగా చర్చించిన కేబినెట్‌ ఈసారి కూడా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసేందుకు నిర్ణయించింది. రాబోయే సీజన్‌లో రాష్ట్రంలో సాగయ్యే మొక్కజొన్నపైనా కేబినెట్‌ చర్చించింది. వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, అదేవిధంగా మొక్కజొన్న దిగుమతులపై సుంకాలు తగ్గించడం వంటి చర్యలతో రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేయకపోవడమే శ్రేయస్కరమని అభిప్రాయపడింది.

Also Read: వామ్మో… ఆ గురుకుల కేంద్రంలో 50 మంది విద్యార్థులకు కరోనా..?

అంతేకాదు.. మక్క పంటను కొనేది లేదని.. మార్కెట్‌లోనూ కొనేవారు లేరని సీఎం కేసీఆర్‌‌ తేల్చి చెప్పారు. మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చుడు అసాధ్యమని, యాసంగిలో మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వానికి బాధ్యత కాదని స్పష్టం చేశారు. పౌల్ట్రీ వ్యాపారులతో చర్చలు జరిపినా వారు కొనేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. బీహార్‌‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, రాజస్తాన్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కోళ్ల దాణా తక్కువ ధరకే దొరుకుతుండడంతో ఇక్కడ పండిన పంటను కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు.

ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో 28 కోట్ల టన్నుల మొక్కజొన్న నిల్వ ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం 3.53 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. దేశం మొత్తం 2.42 కోట్ల టన్నులు మాత్రమే అవసరమని చెప్పుకొచ్చారు. ఒక్క వానాకాలంలో దేశవ్యాప్తంగా 2.04 కోట్ల ఎకరాల్లో పంట సాగు చేశారని, 4,10 కోట్ల టన్నుల పంట త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోందని సీఎం తెలిపారు.

అయితే.. మొక్కజొన్న పంటను కొనేది లేదని సీఎం తేల్చి చెప్పడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంలో పడింది. ఇదే అదునుగా వ్యాపారులు తక్కువ ధరకు మక్కలు కొనేందుకు సిద్ధం చేశారు. ఈ సీజన్‌కు 7.65 లక్షల టన్నుల పంట దిగుబడి రావొచ్చని ఆఫీసర్లు అంచనా వేశారు. క్వింటాల్‌ ధర రూ.1850 ఉండగా.. ఈసారి రైతులకు రూ.500 కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.

Also Read: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. హోం లోన్ తీసుకునే వారికి శుభవార్త..?

వీటితోపాటే నాలా చట్టానికి సవరణ, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్‌ ద్వారా సంబంధిత వివరాలను అందజేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ భూమార్పిడి సులభతరం చేస్తూ చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది. రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టం 1955 సవరణకు నిర్ణయం తీసుకుంది. వార్డుల రిజర్వేషన్‌లకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణలు చేస్తూ నిర్ణయించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ ఆస్తుల నమోదుకు గడువును మరో పది రోజులు పెంచారు.