India Weather Report 2022: బ్రహ్మంగారు ఏనాడో చెప్పారు దేశంలో వాతావరణ పరిస్థితులు మారతాయని. ఎండాకాలం వాన కాలం అవుతుందని వాన కాలం కాస్త ఎండా కాలంగా మారుతుందని ఆనాడే చెప్పారు. అది అక్షరాలా నిజమే అనిపిస్తుంది. ఒక పక్క ఉత్తరాదిలో ఎండలు పెరుగుతున్నాయి. దక్షిణాదిలో మాత్రం వాతావరణం చల్లగా మారుతోంది. వర్షాలు కూడా పడుతున్నాయి. దీంతో ఈ విచిత్ర పరిస్థితిపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు విస్తుపోతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. నిన్న ఢిల్లీలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది.
దీంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. ఎండ ధాటికి వడదెబ్బ సోకే ప్రమాదాలు పొంచి ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. 1944 మే 29న సఫ్దర్ జంగ్ వాతావరణ కేంద్రంలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రస్తుతం దాన్ని తలదన్నేలా 49 డిగ్రీలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఢిల్లీ నిప్పుల కుంపటి కానుందని తెలుస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అదే స్థాయిలో మండిపోతున్నాయి.
Also Read: Kiran Kumar Reddy: కాంగ్రెస్ లోకి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ.. ఢిల్లీ టూర్ అందులో భాగమేనా?
గుజరాత్ లో కూడా ఎండలు తమ ప్రభావం చూపిస్తున్నాయి. ఎండల ధాటికి పక్షులు తాళలేక రాలిపోతున్నాయి. తమ ప్రాణాలు విడుస్తున్నాయి. వేడిమిని భరించలేక పిట్టల్లా రాలిపోతున్నాయి. దీనిపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇలా పెరిగితే భవిష్యత్ లో కష్టమే అని చెబుతున్నారు. ఇంతలా వేడి పెరగడానికి కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పరిష్కార మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. కానీ ప్రకృతి విలయానికి సమాధానాలు మాత్రం దొరకడం లేదు.
దక్షిణాదిలో పరిస్థితి మరోలా ఉంది. ఉత్తరాది ఎండలతో కకావికలం అవుతుంటే దక్షిణాదిలో వర్షాలు కలవరపెడుతున్నాయి. పంటలు చేతికొచ్చిన సమయంలో భారీ వర్షాలు అన్నదాతలను ఆవేదనకు గురి చేస్తున్నాయి. కుండపోతలతో పిడుగులు పడుతూ వానలు పడుతున్నాయి.ఈదురుగాలులు బీభత్సం సృస్టిస్తున్నాయి. రుతుపవనాలు ఇప్పటికే రాష్ట్రంలోకి ప్రవేశించాయని తెలుస్తోంది. అందుకే ఇవి అండమాన్ నికోబార్ అంతటా విస్తరించి చురుగ్గా కదులుతోంది.
మొత్తానికి నాలుగు రోజుల ముందే రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెలాఖరులోగా కేరళను తాకవచ్చని చెబుతున్నారు. దీంతో వానలు ముందే వస్తున్నాయనే సంతోషకర వార్త రైతులకు ఆనందాన్ని కలిగిస్తోంది. దేశంలో మాత్రం ఈ విచిత్ర పరిస్థితులకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాదిలో ఎండలు దక్షిణాదిలో వానలు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read:KCR BJP Congress: కేసీఆర్ టార్గెట్ ఫిక్స్.. బీజేపీ కూడా అదే దారి.. కాంగ్రెస్ కు ఏంటీ పరిస్థితి?