Vijayasai Reddy- Chandrababu Naidu: ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. అధికార పక్షం, ప్రధాన విపక్షం కత్తులు దూసుకుంటున్నాయి. ట్విట్టర్ వేదికగా నేతలు తలబడుతున్నారు. ఒకవైపు మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. అది మరువక ముందే వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ట్విట్ల వర్షం కాక రేపుతోంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును.. తనను భావి తరాలకు ఆదర్శంగా చెప్పుకునే ఒక్క పథకం కూడా ఏపీలో లేకపోవడం శోచనీయమని ట్విట్ చేశారు. పొలిటికల్ మిర్చి, నాకౌట్ అంటూ వరుస పోస్టులు పెట్టిన విజయసాయి రెడ్డి చంద్రబాబుకు పవర్ ఫుల్ పంచ్ లు వేశారు. ఎలన్ మస్క్ కు ఐడియా ఇచ్చి స్పేస్ X రాకెట్ల కంపెనీ పెట్టించింది బాబేనంటగా అంటూ హేళన వ్యాఖ్యలు మొదలు పెట్టారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా దానికి చంద్రబాబే కారకుడున్న రేంజ్ లో ప్రచారం చేసుకుంటారని కూడా ఎద్దేవా చేశారు. దావోస్ లో ఈయనను కలిసేందుకు బిల్ గేట్స్ రోజంతా వెయిట్ చేశాడని మీడియాలో రాయించుకున్న విషయాన్ని ప్రస్తావించారు.
అంతటితో ఆగకుండా చంద్రబాబు పొత్తుల రాజకీయంపై కూడా వ్యంగ్యోక్తులు సంధించారు. చంద్రబాబును చూస్తే జాలి వేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఆయన్ను ప్రజలే పొత్తులు పెట్టుకోమని కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు, ఇల్లు కట్టుకోమంటున్నారట అంటూ ఇలా నాకౌట్ పేరుతో చేసిన పోస్టులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అలాగే చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను జనం నమ్మడం లేదంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాలికి చెట్ల కొమ్మలు విరిగినా అది జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే అంటూ చంద్రబాబు విరుచుకుపడుతున్న తీరును గుర్తుచేశారు. దానిని ప్రజలు నమ్మడం లేదు సరికదా.. నవ్వుకుంటున్నారని సైతం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Also Read: India Weather Report 2022: దేశ చరిత్రలోనే ఇదో అసాధారణ వాతావరణం.. ఏం జరుగుతోంది?
టీడీపీ నేతలపై వ్యక్తిగత కామెంట్ల కు సైతం దిగారు. పార్టీ నేతలు లోకేష్ మాటలు విని చెడిపోయారని కూడా ఆరోపించారు. నేరాలకు తెగబడ్డారంటూ పోస్ట్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో టిడిపి మహిళా నేత అరెస్ట్ అయ్యారని, బాలికపై లైంగిక వేధింపులు, ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్ జైన్ అరెస్ట్ అయ్యారని, టీడీపీ ఎమ్మెల్సీ కారులో అక్రమ మద్యం పట్టివేతకు గురైందని పోస్ట్ చేశారు. అటువంటి వారు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిదులపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ పై చంద్రబాబు వ్యవహార శైలిపై సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒకప్పుడు పార్టీ ప్రచారంలో పాల్గొన్న జూ.ఎన్టీఆర్ పేరును కుప్పం ప్రజాదర్బార్ లో ఒక అభిమాని ప్రస్తావించడంతో చంద్రబాబు ఎందుకు చిర్రెత్తిపోయారని ప్రశ్నించారు. అయితే ఈ రేంజ్ లో సాయిరెడ్డి ట్విట్లు హోరు పెంచడం చర్చనీయాంశమైంది. ఏపీ ప్రభుత్వం చుట్టూ నెలకొన్న పరిస్థితులకు కలత చెంది సాయిరెడ్డి ఈ ఆరోపణలకు దిగుతున్నారని టీడీపీ నాయకులు అనుమానిస్తున్నారు.
Also Read:Kiran Kumar Reddy: కాంగ్రెస్ లోకి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ.. ఢిల్లీ టూర్ అందులో భాగమేనా?
Recommended Videos: