Bigg Boss Non Stop Telugu OTT: ఓటీటీ వేదికగా సాగుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ చివరి దశకు చేరింది. విన్నర్ ఎవరో తేలే సమయం వచ్చింది. గేమ్ రక్తి కడుతుండడంతో ఈ షో చూసేవారిలో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు కంటెస్టెంట్లు మాత్రమే టైటిల్ కోసం పోటీ పడ్డారు. కానీ లాస్ట్ పొజిషన్ కు వచ్చే సరికి మరి కొంత మంది పోటీకి సై అంటున్నారు. దీంతో ఫైనల్ టైటిల్ ను ఎవరు దక్కించుకుంటారోనన్న ఆసక్తి పెరిగింది. అయితే అన్ అఫిషియల్ ఓటింగ్ ప్రకారం.. ఇద్దరు మాత్రమే పోటాపోటీగా ఉన్నారు. కానీ అఫిషియల్ ఓట్ల శాతం ఎలా ఉందో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మొత్తంగా ఓటీటీలో సాగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ పై ఫైనల్ కు వచ్చేసరికి ఉత్కంఠ పెరుగుతోంది.
బిగ్ బాస్ 5 సీజన్లు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. దీంతో ఈసారి మొదటి సారిగా ఓటీటీ వేదికగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ పేరిట షో ప్రసారం అయింది. డిస్నీ +హాట్ స్టార్ లో రన్ అయిన ఈ షో లో మాజీ కంటెస్టెంట్లతో పాటు కొత్తవారు హౌస్ లోకి వెళ్లారు. అయితే ఎలిమినేషన్లో భాగంగా చాలా మంది బయటికి వెళ్లారు. ప్రస్తుతం హౌస్ లో బిందుమాధవి, అఖిల్ సార్థక్, యాంకర్ శివ, అరియానా గ్లోరీ, మిత్రా శర్మ, బాబా భాస్కర్, అనిల్ లు మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ ప్లేస్ లో బిందు మాధవి, అఖిల్ సార్థక్ లు పోటీ పడుతున్నారు. గత మూడు వారాల నుంచి బిందు మాధవి, అఖిల్ లు మాత్రమే ఫస్ట్ , సెకండ్ ప్లేసులోకి వెళ్తున్నారు.
Also Read: Mahesh Babu: 23 ఏళ్ల కెరీర్ లో మొదటిసారి ఆ పనిచేసిన మహేష్.. షేకింగ్ వీడియో
ఇప్పుడు ఫైనల్ స్టేజీకి రావడంతో విన్నర్ ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే సోషల్ మీడియా, అన్ అఫిషియల్ లెక్కల ప్రకారం.. విన్నర్ వీరే అని డిసైడ్ అవుతున్నారు. కానీ హాట్ స్టార్ లెక్కలు వేరే ఉంటాయి. బిగ్ బాస్ వాటి లెక్కలు ఎలిమినేషన్ పూర్తయిన తరువాత కూడా చూపించరు. దీంతో అన్ అఫిషియల్ సైట్స్ లో ఓటింగ్ ట్రెండ్ తెలుస్తోంది.. సోషల్ మీడియా ప్రకారం చూస్తే.. ఇద్దరు మాత్రమే పోటీ పడుతున్నారు. విన్నర్ టైటిల్ వీరిలో ఒకరు దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.
మొదటి నుంచి సూపర్ ఫర్ఫామెన్స్ ఇస్తున్న బిందు మాధవి, అఖిల్ సార్థక్ లే ఫైనల్ స్టేజికి వెళ్లే అవకాశం ఉంది. అన్ అఫిషియల్ సైట్స్ ప్రకారం.. అఖిల్ సార్థక్ 45 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తరువాత స్థానంలో బిందుమాధవి 38 శాతం ఓటింగ్ దక్కించుకుంది. కానీ యూట్యూబ్ పోలింగ్స్ లో తేడాలున్నాయి. ఇక్కడ బిందుమాధవి 50 శాతం పైగానే ఓటింగ్ దక్కించుకుంది. అఖిల్ 30 శాతానికే పరిమితం అయ్యారు. ఓటీటీ బిగ్ బాస్ ను ఎక్కువగా యూట్యూబ్ వ్యూహార్స్ చూస్తారు కాబట్టి బిందు మాధవి ఈసారి టైటిల్ ను గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా మొదటిసారి టైటిల్ ను గెలుచుకున్న లేడీగా ఈమె రికార్డు సృష్టించడం ఖాయమంటున్నారు.
అటు అఖిల్ కూడా బిందుమాధవితో పోటీ పడుతున్నాడు. ఒకవేళ అఫిషియల్ ఓటింగ్ లో తేడాలుంటే అఖిల్ టైటిల్ కొట్టే అవకాశం ఉంది. గత సీజన్లో రన్నరప్ గా నిలిచిన ఆయన ఈసారి ఎలాగైనా విన్నర్ గా నిలవాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక మిగతా కంటెస్టెంట్లు యాంకర్ శివ, అరియానా గ్లోరీ, మిత్రా శర్మ, బాబా భాస్కర్, అనిల్ లు వీరికి పోటీగా రావడం లేదు. దీంతో వారు టైటిల్ ప్లేసులోకి వచ్చే అవకాశమే లేదు.ప్రస్తుతానికి బిందుమాధవియే టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోందని అంటున్నారు.
Also Read:Heroes Who Married Item Girls: ఐటమ్ సాంగ్స్ చేసేవారిని వివాహం చేసుకున్న హీరోలు వీరే