PM Gati Shakti: అమెరికా ఆర్థికంగా బలమైన దేశం కావచ్చు. ప్రపంచం మీద పెత్తనం చలాయిస్తూ ఉండొచ్చు. కానీ నేటికీ తయారీ రంగంలో, సరుకు రవాణాలో చైనానే మేటి. వివిధ దేశాల్లో పోర్టుల నిర్మాణంలోనూ తనకు తానే సాటి. అందుకే అంతటి అమెరికా కూడా పలు విషయాల్లో చైనా శరణు జొచ్చుతుంది. చైనా మీద ప్రస్తుతం మోడీ గుర్రుగా ఉన్న నేపథ్యంలో.. డ్రాగన్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే పిఎం గతి శక్తి ద్వారా సరుకు రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు మోడీ ఒక రోడ్డు మ్యాప్ వేశారు. ఇది లాజిస్టిక్ రవాణా లోనే గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు.

ఏంటి ఈ ప్లాన్
దేశీయ లాజిస్టిక్ రంగం ఐదవ అతిపెద్ద ఉపాధి కల్పనా దారు. కానీ ఇది అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటున్నది. దీనికి పరిష్కారం చూపడంతో పాటు రవాణా విజయాన్ని 13 _ 14 శాతం నుంచి 0 డిజిట్ కు పర్మితం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. చివరి కిలోమీటర్ రాయి వరకు సరఫరాను వేగవంతం చేయడంతో పాటు వ్యాపారుల డబ్బు, సమయాన్ని ఆదా చేయడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. పీఎం గతి శక్తి కార్యక్రమం ద్వారా మున్ముందు సంవత్సరాలలో రవాణా వ్యయం 7.5%కి తగ్గించాలనేది ప్రభుత్వ నిర్ణయం.. పీఎం గతి శక్తి మిషన్ లో భాగంగా ఏర్పాటైన కార్యదర్శుల సాధికారత బృందం ఈ విధానాన్ని అమలు చేస్తుంది. అయితే ఈ విధానాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ 2019లో ముసాయిదా రూపంలో విడుదల చేసినప్పటికీ కోవిడ్ కారణంగా జాప్యమయింది. దీంతో ఈ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి బడ్జెట్లో మరోసారి ప్రకటించింది.దేశ జీడీపీలో లాజిస్టిక్స్ రంగం వాటా 13 నుంచి 14 శాతం వరకు ఉండవచ్చునని ఒక అంచనా.
యూ లిప్ విధానంలో..
ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ ఫామ్ స్థూలంగా చెప్పాలంటే యూలిప్, ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సర్వీసెస్ (ఈ లాగ్స్) ఎగుమతి దారులు, పరిశ్రమల రవాణా దక్షతను పెంచుతాయి. రవాణా రంగానికి చెందిన అన్ని డిజిటల్ సేవలు ఒకే పోర్టల్ లోకి చేరిపోతాయి. ఫలితంగా ఎగుమతి దారులకు దీర్ఘకాలిక, ప్రయాస ప్రక్రియల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ_ లాగ్స్ పోర్టల్ వల్ల పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారంపై ప్రభావం చూపుతున్న ఇతర సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. వీటిని పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇవే కాకుండా పేస్ లెస్ అసెస్మెంట్ ద్వారా ఈ _ వే బిల్లులు, ఫాస్టాగ్ లు త్వరితగత రవాణాకు తోడ్పడతాయి. డ్రోన్లు కూడా రవాణాలను మరింత మెరుగు పరుస్తాయి. నౌకాశ్రయాల సామర్థ్యాన్ని పెంచడం వల్ల కంటైనర్ల టర్న్ అరౌండ్ సమయం 44 నుంచి 26 గంటల వరకు తగ్గింది. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టులు, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లతో అనుసంధానించడం ద్వారా మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చెందాయి. లాజిస్టిక్ రంగంలో సమూల మార్పుల వల్ల ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. సంస్కరణల ఫలితంగా వస్తు తయారీ హబ్ గా చైనా తర్వాతి స్థానంలో నిలిచింది.

ఇవి ఇంకా మెరుగైన ప్రయోజనాలు ఇస్తే చైనా కూడా దాటేసే అవకాశాలు లేకపోలేదు. చైనా యాప్ లు రద్దుచేసి, డ్రాగన్ వస్తువులను నిషేధించిన మోదీ.. ప్రస్తుతం తయారీ రంగంలో కీలకమైన సంస్కరణలకు పచ్చ జెండా ఊపడం ద్వారా మరోసారి డ్రాగన్ పై తనకు ఎంత కక్ష ఉందో నిరూపించారు. అంతేకాకుండా మొన్న జరిగిన షాంగై సహకార సంఘం సమావేశంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్ తో కనీసం మాట్లాడలేదు. కరచాలనం కూడా చేయలేదు. కేవలం గ్రూప్ ఫోటో మాత్రం దిగారు. ఆ ఫోటోలోనూ అతి సమీపంలో ఉన్నా ఆ నేతలతో మోడీ మాట్లాడలేదు. సమావేశాల్లోని మిగతా సందర్భాల్లోనూ మోడీ వారికి సమీపంగా ఉన్నా మాట కూడా కలపలేదు. డిన్నర్ సమావేశానికి కూడా డుమ్మ కొట్టారు. ఇది జరిగిన ఒక రోజు తర్వాత చైనా కు దిమ్మతిరిగేలా లాజిస్టిక్ రంగంలో తమ ఏం చేశామో, మున్ముందు ఏం చేయబోతామో 70 ఎం ఎం సినిమాలో చూపించారు.