Ravichandran Ashwin: సామాజిక మాధ్యమాల పుణ్యమాని వ్యక్తిగత జీవితం లేకుండా పోతోంది. ప్రతి దాన్ని బహిరంగం చేయడం అలవాటుగా మారుతోంది. ఇది విచ్చలవిడితనానికే నిదర్శనంగా కనిపిస్తోంది. మనిషిలో కూడా జంతు లక్షణాలు కనిపిస్తున్నాయి. నాలుగు గోడల మధ్య జరిగే విషయాలను కూడా నలుగురితో పంచుకోవాలనుకోవడం నాగరికతో మరేదో కూడా అర్థం కావడం లేదు. భార్యాభర్తల సంబంధంలో మొదటి రాత్రి అత్యంత విలువైనది. దీని కోసం ఎన్నో సంవత్సరాల పాటు ఇద్దరు ఎదురు చూస్తారు. దానిలో ఉండే మజా వారిద్దరే అనుభవించాలి. కానీ నలుగురి పంచుతాను అంటే కుదరదు. సనాతన హిందూ ధర్మం ఇలాంటి విషయాలు ఒప్పుకోదు. శృంగారానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మనం వ్యవహరించే విధానంపైనే మన అనుచరులు ఉంటారు. మనం ప్రతి విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో పెడితే ఇక వ్యక్తిగత జీవితమనేది ఉంటుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. అసలు ప్రపంచం ఎక్కడికి పోతోంది. ఏమైపోతోందనే అభిప్రాయం పలువురిలో వస్తోంది.

నాగరికత పరిణామ క్రమంలో మనిషి ఎన్నింటినో దాటేశాడు. కానీ వ్యక్తిగత జీవితమనే దాన్ని మాత్రం ఎప్పటికి కూడా దాటకూడదు. అది మన సొంతం. దాన్ని ఎప్పుడు కూడా ప్రసార మాధ్యమాల్లో పెట్టకూడదు. వాటి గురించి చర్చించకూడదు. కానీ ప్రస్తుతం నాగరికత పేరుతో వెర్రితలలు వేస్తోంది. బెడ్ రూం విషయాలను కూడా నలుగురితో పంచుకోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అది కూడా ఎవరో తెలియని వారంటే ఏదో అనుకోవాలి. సర్వం తెలిసిన వారే తప్పులు చేస్తే ఇక వారించేదెవరు? భార్యలకు స్వేచ్ఛ ఇవ్వడం మంచిదే. కానీ ఇంతలా స్వేచ్ఛ ఇస్తే ఇలాగే ఉంటుంది. నలుగురిలో నవ్వుల పాలు కావడం తప్ప ఎందుకంత స్వాతంత్ర్యం.
Also Read: BCCI- Impact Player Rule: టి20కి ఇంపాక్ట్ పెంచింది: బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఏంటంటే?
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 255 అంతర్జాతీయ మ్యాచుల్లో 659 వికెట్లు తీసి 5 సెంచరీలు చేశాడు. 3799 పరుగులు చేశాడు. కుంబ్లే తరువాత అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. శనివారం తన 37వ పుట్టినరోజును జరుపుకోవడంతో చాలా మంది ప్రముఖులు అతడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అతడి భార్య ప్రీతి నారాయణన్ కూడా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. గమ్మత్తైన పోస్టులతో అందరిని అలరిస్తుంది. చమత్కారానికి వెటకారం జోడిస్తూ నవ్విస్తూ ఉంటుంది. కానీ ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేస్తూ విమర్శలు ఎదుర్కోవడం మామూలే.
ఎవరైనా వ్యక్తిగత విషయాలు బహిరంగంగా చర్చించడం తగదు. ఈ విషయం తెలిసినా ప్రీతి నారాయణన్ కట్టుబాట్లు దాటుతూ విశృంఖలత్వానికి తెర తీస్తోంది. తమ మొదటి రాత్రి విషయాలను అభిమానులతో పంచుకోవడమే వివాదంగా మారుతోంది. ఏ ఆడదైనా తన బెడ్ రూం విషయాలు ఇతరులతో షేర్ చేసుకోవడం నిషేధం అని తెలిసినా తమ ఫస్ట్ నైట్ ను ఓ టెస్ట్ మ్యాచ్ గా భావించి కామెంట్లు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఆడవారు వ్యక్తిగత విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసినా ఆమె మాత్రం ఇలా మాట్లాడటం సంచలనంగా మారింది. దీనిపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి.

సామాజిక మాధ్యమాలున్నవి వ్యక్తిగత విషయాలను గురించి చర్చించేందుకు కాదు సామాజిక విషయాలపై అవగాహనకు మాత్రమే. కానీ కొందరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. దాచుకోవాల్సిన విషయాలపై చర్చలు పెట్టడం ఏమిటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. రానురాను రాజు ారి గుర్రం గాడిదయిందన్నట్లు చైతన్యం కొత్త పుంతలు తొక్కుతోంది. పడక గది ముచ్చట్లు కాస్త బహిరంగంగా మాట్లాడటం దేనికి సంకేతమో తెలియడం లేదు. మనిషిలోని జంతు సంస్కృతికి నిదర్శనమా? నాగరికతకు మరో రూపమా? తెలియడం లేదు. మొత్తానికి ప్రీతి నారాయణన్ చేసిన పని అందరిలో సందేహాలకు కారణమైందని తెలుస్తోంది.