Sleep Tips: మనిషి తన జీవితంలో ఎక్కువ భాగం నిద్రకే పోతుంది. ఎందుకంటే ప్రతి మనిషి తన జీవితకాలంలో నిద్రపోయే సమయమే ఎక్కువ. సగటున 30-40 శాతం సమయం నిద్రలోనే పోతోంది. ఎందుకంటే ప్రతి జీవికి నిద్ర అనేది ముఖ్యమే. హాయిగా నిద్రపోకపోతే మనిషి మనుగడ ప్రమాదంలో పడినట్లే. అతడి ఆయుర్దాయం క్రమంగా క్షీణిస్తుంది. రోగాలు దరి చేరతాయి. అవయవాలు దెబ్బతింటాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. అందుకే మనిషికి నిద్ర కూడా జీవితంలో ఒక భాగమే కావడం గమనార్హం. అలాంటి నిద్రను కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు.

ఆధునిక నాగరికత పేరుతో పబ్ లు తిరుగుతూ రాత్రంతా మేల్కొని ఎప్పుడో తెల్లవారు జామున నిద్రపోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే రాత్రి ఉన్నది కేవలం పడుకోవడానికే తప్ప ఇతర పనులు చేయడానికి కాదు. అర్థరాత్రి దాకా తిరుగుళ్లు చేస్తే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఫలితంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా పట్టించుకోవడం లేదు. మనం పడుకుంటే మన శరీర అవయవాలు కూడా విశ్రాంతి తీసుకుని ఉదయం లేవగానే యాక్టివ్ గా మారతాయి. అంతేకాని రాత్రంతా మేల్కొంటే అవి పనిచేయడం కష్టమే.
రాత్రుళ్లు నిద్ర పట్టకపోతే వైద్యులు చక్కని పరిష్కార మార్గాలు చూపుతున్నారు. రాత్రి నిద్ర రాకపోతే ఏదైనా పుస్తకం చదివితే ఇట్టే నిద్ర వస్తుంది. అలాగే కమ్మనైన సంగీతం వింటే నిద్ర హాయిగా వస్తుంది. ఇంకా గోరువెచ్చటి పాలు తాగినా నిద్ర కమ్ముకొస్తుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనసుంటే మార్గముంటుంది. నీకు నిద్ర పోవాలనే బలమైన సంకల్పం ఉంటే నిద్ర అదే వస్తుంది. ప్రశాంతమైన నిద్రపోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కూడా హాయిగా నిద్ర పడుతుంది.

అరికాళ్లను నూనెతో మర్దన చేస్తే కూడా ఫలితం ఉంటుంది. సుఖవంతమైన నిద్రతోనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా మారుతుంది. ఏ పని అయినా ఇట్లే చేస్తాం. అంతటి ప్రభావం నిద్రకు ఉంటుంది. అదే కచ్చితమైన నిద్ర లేకపోతే మనసు బాగుండదు. ఒంట్లో నలతగా ఉంటుంది. బద్ధకం ఆవహిస్తుంది. ఎన్నో ప్రతిబంధకాలు చోటుచేసుకుంటాయి. అందుకే నిద్రను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా కచ్చితమైన వేళలను పాటిస్తే సరిపోతుంది. నిద్రతోనే మనిషి మనుగడ ఉంటుందనే విషయం గ్రహించుకోవాలి.