చైనాకు మరో గట్టి షాక్‌ ఇచ్చిన భారత్

కాపీ కొట్టడంలో.. ఓ వస్తువుకు డూప్లికేట్‌ తయారుచేయడంలో చైనాకు తిరుగులేదు. ఒరిజినల్‌ వస్తువు ధరలో సగం ధరకే చైనా తన వస్తువులను విక్రయిస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లుగా సరుకులను డంప్‌ చేస్తున్న డ్రాగన్‌ దేశానికి తాజాగా మోడీ సర్కార్‌‌ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా తీసుకున్న నిర్ణయం చైనాకు చెందిన పలు కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు భారీగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. Also Read: కేంద్రం వ్యవసాయ సంస్కరణలు.. ఎవరికీ లాభం? ఇప్పటికే ఎల్‌ఏసీ దగ్గర చైనాకు […]

Written By: NARESH, Updated On : September 19, 2020 3:21 pm

India-China

Follow us on


కాపీ కొట్టడంలో.. ఓ వస్తువుకు డూప్లికేట్‌ తయారుచేయడంలో చైనాకు తిరుగులేదు. ఒరిజినల్‌ వస్తువు ధరలో సగం ధరకే చైనా తన వస్తువులను విక్రయిస్తుంటుంది. ఇష్టం వచ్చినట్లుగా సరుకులను డంప్‌ చేస్తున్న డ్రాగన్‌ దేశానికి తాజాగా మోడీ సర్కార్‌‌ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. తాజాగా తీసుకున్న నిర్ణయం చైనాకు చెందిన పలు కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు భారీగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

Also Read: కేంద్రం వ్యవసాయ సంస్కరణలు.. ఎవరికీ లాభం?

ఇప్పటికే ఎల్‌ఏసీ దగ్గర చైనాకు భారత్‌ దీటైన జవాబు ఇస్తూనే ఉంది. ఎక్కడా ఏమాత్రం తగ్గకుండా మన సైనికులు డ్రాగన్‌ దేశానికి బుద్ధిచెబుతూనే ఉన్నారు. బార్డర్‌‌లో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇప్పటికే మన కేంద్ర సర్కార్‌‌ చైనా యాప్‌లను నిషేధించి పెద్ద షాక్‌ ఇచ్చింది. తాజాగా.. చైనా ఆర్థిక వ్యవస్థపై మరో సారి దెబ్బ వేసేలా భారత్‌ నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి దేశానికి వచ్చే నాసిరకం వస్తువులకు భారీ చెక్ పెట్టింది.

ప్రపంచంలోనే అత్యధికంగా ఎల్‌ఈడీలను వినియోగించే రెండో దేశంగా పేరొందిన భారత్‌.. దీన్ని అవకాశంగా మార్చుకొని చైనా కంపెనీలు పలు నాసిరకం వస్తువులను ఇండియాకు పంపిస్తున్నాయి. ఇక అలాంటి అవకాశం ఇవ్వకుండా చైనా నుంచి దేశంలోకి దిగుమతి అయ్యే అన్ని ఎల్ఈడీలకు.. వాటి తయారీ పరికరాలు.. నమూనాలకు పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఎల్ఈడీ ఉత్పత్తికి కఠినమైన నాణ్యత పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: చైనాకు సహకారం? ప్రముఖ జర్నలిస్ట్ అరెస్ట్?

ప్రతీ టీవీలోనూ క్వాలిటీ సరిగా ఉంటేనే దేశంలోకి అనుమతించనున్నారు. ఒకవేళ పరీక్షలో క్వాలిటీ మిస్‌ అయితే ఆ సరుకులను వెనక్కి పంపించడమో లేదా ఇక్కడే నాశనం చేయడమో చేస్తారు. ఇదే జరిగితే చైనా వ్యాపార సంస్థలకు భారీ ఎత్తున నష్టం కలుగుతుంది. గతంలో మాదిరి చౌకబారు ఉత్పత్తులను భారత్‌లోకి డంప్ చేసే ఆస్కారం ఉండదు. దీంతో భారతీయులకు ఇక నుంచి క్వాలిటీ వస్తువులే అందుబాటులోకి రానున్నాయి.