https://oktelugu.com/

రియల్ హీరో అనిపించుకున్న ‘మెగా హీరో’

మెగా ఫ్యామిలీ హీరోలంతా మెగాస్టార్ చిరంజీవి చూపిన బాటలోనే నడుస్తున్నారు. సినిమాల విషయంలోనే కాకుండా సాయం అందించడంలోనూ మెగాస్టార్ నే ఆదర్శంగా తీసుకుంటారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటితోపాటు  గుప్తదానాలు ఎన్నో చేస్తుంటారు. ఇటీవల సినీ కార్మికుల కోసం ‘సీసీసీ మనకోసం’ ఏర్పాటుచేసి కరోనా కాలంలో వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆయన బాటలోనే మెగా హీరోలంతా కూడా వారివారి స్థొమతకు తగినట్లు సాయం చేస్తుంటారు. Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’ పై […]

Written By: , Updated On : September 19, 2020 / 02:44 PM IST
saidharam tej

saidharam tej

Follow us on

saidharam tej

మెగా ఫ్యామిలీ హీరోలంతా మెగాస్టార్ చిరంజీవి చూపిన బాటలోనే నడుస్తున్నారు. సినిమాల విషయంలోనే కాకుండా సాయం అందించడంలోనూ మెగాస్టార్ నే ఆదర్శంగా తీసుకుంటారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి వాటితోపాటు  గుప్తదానాలు ఎన్నో చేస్తుంటారు. ఇటీవల సినీ కార్మికుల కోసం ‘సీసీసీ మనకోసం’ ఏర్పాటుచేసి కరోనా కాలంలో వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆయన బాటలోనే మెగా హీరోలంతా కూడా వారివారి స్థొమతకు తగినట్లు సాయం చేస్తుంటారు.

Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’ పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా తన మామలైన చిరంజీవి, పవన్ కల్యాణ్ బాటలోనే వెళుతున్నాడు. తనకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నారు. గతేడాది సాయిధరమ్ తేజ్ పుట్టిన సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తమ భవన నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరినట్లు తెలిపాడు. దాని నిర్మాణ బాధ్యతను తాను తీసుకున్నానని.. తన అభిమానులు తన పుట్టినరోజుకు పెట్టే ఖర్చును వృద్ధాశ్రమం కోసం ఇవ్వాలంటూ కోరాడు.

తేజ్ పిలుపుకు స్పందించిన మెగా అభిమానులు లక్ష రూపాయాల వరకు సాయం చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు తేజ్ తన సొంత డబ్బులు వెచ్చించి పెద్దమనస్సును చాటుకున్నాడు. తన టీమ్ ద్వారా విజయవాడలోని సింగ్ నగర్ కాలనీలో ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవ’ వృద్ధాశ్రమ నిర్మాణాన్ని తేజ్ పూర్తి చేసాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: డ్రగ్స్ కేసులో తెరపైకి మరో హీరోయిన్ పేరు..!

అంతేకాకుండా పూర్తి కాబడిన ఈ వృద్ధాశ్రమానికి ఏడాదిపాటు ఆర్థికంగా అండగా ఉంటానని తేజ్ ప్రకటించాడు. 2019లో తన పుట్టిన రోజున ఇచ్చిన మాటప్రకారం మెగా అల్లుడు సాయిధరమ్ వారికి అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్నాడు. దీంతో పలువురు సెలబ్రెటీలు.. అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయిధరమ్ ఇలానే తన మామలు చూపిన మార్గంలో ముందుకెళ్లాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.