Also Read: ఇష్టమొచ్చినట్లు యాప్స్ డౌన్లోడ్ చెయ్యొద్దు : కేంద్రం
గూగుల్–ఎస్‌బీఐ భాగస్వామ్యంతో యూజర్లు తన స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ పే యాప్ ద్వారా కార్డ్ పేమెంట్స్ చేయొచ్చు. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) సదుపాయం ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ (POS) టర్మినల్స్ వద్ద ట్యాప్ అండ్ పే, షాపుల్లో భారత్ క్యూఆర్ కోడ్ స్కానింగ్, క్రెడిట్ కార్డు ఫిజికల్ కార్డు లేకుండా ఆన్‌లైన్ చెల్లింపులు.. ఇలా మూడు రకాలుగా నిర్వహించొచ్చు.
‘దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. క్రెడిట్ కార్డులు కూడా రూపం మార్చుకుంటున్నాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ రూపంలో కనిపిస్తున్నాయి. మేము ఇప్పుడు గూగుల్‌తో భాగస్వా్మ్యంతో మా కస్టమర్లకు కొత్త, సురక్షితమైన పేమెంట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది’ అని ఎస్‌బీఐ కార్డు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అశ్విని కుమార్ తివారీ తెలిపారు.
Also Read: ఏసీపీ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు
గూగుల్ పే కస్టమర్లు ఇప్పటివరకు యూపీఐ ట్రాన్సాక్షన్లు మాత్రమే నిర్వహించేది. బిల్ పేమెంట్స్, రీచార్జ్, మనీ ట్రాన్స్‌ఫర్ వంటివి బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగానే చేసేది. ఇప్పుడు గూగుల్ పే ద్వారా కార్డుతో కూడా ట్రాన్సాక్షన్లను నిర్వహించొచ్చు. దీనికి ఎస్‌బీఐ కార్డును గూగుల్ పే యాప్‌తో లింక్ చేసుకోవాలి. ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం ఎస్‌బీఐ కార్డుదారులకు మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా వారి కార్డులను గూగుల్ పేతో యాడ్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు కూడా గూగుల్ పే ద్వారా ఈ కొత్త సర్వీసులు పొందొచ్చు.