ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. రెండు రోజుల పాటు అక్కడే ఉండడంతో అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. జగన్ పర్యటనపై అటు వైసీపీ నేతల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడి నుంచి ఏవైనా రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయాలు వెలువడుతాయా అని ఎదురుచూస్తున్నారు.
Also Read: తిరుపతి లోక్ సభ బరిలోకి బీజేపీ.. సోము వీర్రాజు సై
మంగళవారం జగన్ హడావిడిగా హస్తినకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు దేశ రాజధానికి చేరుకున్న జగన్.. 6.40 గంటలకు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, రావాల్సిన నిధులు, మూడు రాజధానులు, రాజధాని భూములు, ఏపీ ఫైబర్ నెట్, కోర్టు కేసులు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే.. జగన్ రెండో రోజూ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రమే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమైన ఆయన బుధవారం ఉదయం మరోసాని అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: ప్రజలందరికీ గూగుల్ పే తీపికబురు
అంతకుముందు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరానికి నిధులు, ఇతర ప్రాజెక్టులకు కేంద్ర సహకారంపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు ఉన్నారు.