Also Read: రెండో రోజూ అమిత్ షాతో జగన్ భేటీ.. ఏమై ఉంటుందబ్బా?
మరికొద్ది రోజుల్లోల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటితోపాటే దేశంలో ఎక్కడెడక్కడ ఖాళీ స్థానాలు ఉన్నాయో వాటికీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరో రెండు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలపై వైసీపీ, టీడీపీ ఇంకా ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేదు. సాధారణంగా సిట్టింగ్ సభ్యుడు చనిపోయినప్పుడు వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తూ ఉంటారు. అలా చేస్తే వేరే పార్టీ దాదాపు పోటీలో ఉండదు. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ముందు నుంచీ బీజేపీకి కొంచెం చెప్పుకోదగ్గ చరిత్రనే ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా ఆ సీటు బీజేపీకి వచ్చేది. అక్కడి నుంచి ఎన్.వెంకటస్వామి ఓ సారి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీటు దక్కినా.. కొద్ది తేడాతో ఓటమి పాలైంది. 2009లో మాత్రం విడిగా పోటీ చేసి 20 వేల ఓట్లు తెచ్చుకోగలిగింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తమకు బాగా క్యాడర్ ఉందని ఇప్పటికీ బీజేపీ నమ్మకం. అందుకే బలం నిరూపించుకోవడానికి ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నారు.
Also Read: అర్ధరాత్రి బాలిక ఇంట్లోకి.. సినిమా స్టోరీలా బాలుడి హత్య
ప్రస్తుతం ఏపీలో ఆలయాలపై దాడులను బీజేపీ ఎలుగెత్తి చాటుతోంది. తిరుమల-తిరుపతిలో అపచారాలను వెలుగులోకి తెచ్చి పోరాడుతోంది. ఈ క్రమంలోనే ఆలయాలు.. హిందుత్వ భావాలు ఎక్కువగా ఉన్న తిరుపతిలో పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ పోటీకి సోము వీర్రాజు సై అంటున్నారు. మరి ఎలాంటి ఫలితం వస్తుందనేది వేచిచూడాలి.