Parag Agarwal: ప్రపంచ నెంబర్ వన్ టెక్ కంపెనీలను ప్రస్తుతం భారతీయులు ఏలేస్తున్నారు. గూగుల్, మైక్రసాఫ్ట్, అడోబ్, ప్రస్తుతం ట్విట్టర్‌కు కూడా భారతీయుడే సీఈవో.. అమెరికన్ కంపెనీలను మనవాళ్లు ఎలా శాసిస్తున్నారని అందరికీ అనుమానం కలుగొచ్చు. ఇండియా అనేది గ్లోబల్ మార్కెట్..ఇక్కడ దొరికినన్ని మానవ వనరులు మరెక్కడా దొరకవు. అంతేకాకుండా రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఎకనమికల్ గానే కాకుండా టెక్నాలజీ పరంగా గ్లోబల్ లీడర్‌గా ఎదిగే చాన్స్ ఉందని ఇప్పటికే పలు నివేదికలు, ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రపంచ దేశాలు మొత్తం భారత్‌తో స్నేహం చేస్తూనే వారి వ్యాపారాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నాయి. టాలెంట్, స్కిల్స్‌తో పాటు అండ్ కష్టపడే తత్వం, లీడర్ షిప్ లక్షణాలు కలిగిన భారతీయులను అమెరికన్ కంపెనీలు సీఈవోలుగా నియమించుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్ విషయంలోనూ ఇదే జరిగింది.

పరాగ్‌కు దక్కాల్సిందే..
కేవలం 37 వయస్సులోనే పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవో పదవిని అధిరోహించాడంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం ఈయన గురించి ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. పరాగ్ అందరూ అనుకున్నట్టు మాములు వ్యక్తేం కాదు.. పదేళ్ల కిందట ట్విట్టర్ కంపెనీలో చేరిన పరాగ్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఎంతో కష్టపడి పనిచేసే తత్వం కలవాడు. సాధారణ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే 2018లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందాడు. పరాగ్ ఏ పని అయినా వంద శాతం మనసు పెట్టి చేస్తాడట..
పరాగ్ ఎడ్యూకేషన్..
దేశంలోనే ప్రతీష్టాత్మక విద్యాసంస్థ అయిన ఐఐటీ బొంబాయి నుంచి డిగ్రీ పట్టా అందుకోవడంతో మనోడికి కార్పొరేట్ కంపెనీలు చాలా జాబ్ ఆఫర్లు ఇచ్చాయి. భారీ జీతం ఆఫర్ చేశాయి. కానీ డిగ్రీ తనకు చాలదని వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీ అయిన స్టాన్ ఫోర్డ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పూర్తిచేశాడు.
Also Read: CM Jagan: జగన్ చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారట.. ఇంతకీ ఏం చేశారు?
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉన్నాడు..
టాలెంట్, ఎడ్యూకేషన్‌తోనే కాకుండా పరాగ్‌కు ఒదిగి ఉండే లక్షణం ఎక్కువ.. ట్విట్టర్ లో చేరిన కొత్తలో ఆర్టిఫిసీయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో మంచి ప్రతిభ చూపాడు. చాలా సార్లు ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నాడు. అందరితో మంచి రాపో మెయింటెన్ చేసేవాడు. కింది స్థాయి ఉద్యోగులకు వర్క్ విషయంలో సాయం చేసేవాడు. అందుకే ట్విట్టర్ అధినేత జాన్ డోర్సీ కళ్లు పరాగ్ చుట్టూ తిరిగాయట.. చివరకు ఆయనకు బాధ్యతలు అప్పగించేశాడు.. ఇకపోతే పరాగ్ చదువుకునే రోజుల్లో వండర్స్ క్రియేట్ చేశాడట.. ముంబయిలోని ఉన్నత విద్యాసంస్థల్లో చదివాడు.. ప్రతీసారి క్లాస్ టాపర్.. ఐఐటీ జేఈఈ ఎంట్రన్స్‌లో ఆలిండియా 77వ ర్యాంక్ హౌల్డర్.. 2001 ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ గోల్డ్ మెడలిస్ట్.. మైక్రోసాఫ్ట్, యాహూ, ఏటీ అండ్ టీ ల్యాబ్స్ వంటి మంచి కంపెనీలో జాబ్ చేసి చివరకు ట్విట్టర్ భవిష్యత్‌లో మార్పు తీసుకురానున్నదని భావించి ఇందులో చేరిపోయారట.. చివరకు దానికే అధిపతి అయ్యాడు పరాగ్ అగర్వాల్..
Also Read: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి కుర్చీ లాక్కునే వాడిని.. చంద్రబాబుతో రోశయ్య వ్యాఖ్యలు వైరల్