https://oktelugu.com/

Mahesh Babu: బాలయ్య అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా రానున్న… సూపర్ స్టార్ మహేశ్ బాబు

Mahesh Babu: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. డిసెంబర్ 2 వ తేదీన ఆయన నటించిన అఖండ చిత్రం విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరో వైపు ఆహా ఓటిటీ వేదికగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలయ్య. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రసారం అవ్వగా… మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా కామెడీ కింగ్ బ్రహ్మానందం , దర్శకుడు అనిల్ రావిపూడి రానున్నట్లు ప్రకటించారు. కాగా త్వరలోనే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 02:59 PM IST
    Follow us on

    Mahesh Babu: నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు. డిసెంబర్ 2 వ తేదీన ఆయన నటించిన అఖండ చిత్రం విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరో వైపు ఆహా ఓటిటీ వేదికగా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలయ్య. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రసారం అవ్వగా… మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా కామెడీ కింగ్ బ్రహ్మానందం , దర్శకుడు అనిల్ రావిపూడి రానున్నట్లు ప్రకటించారు. కాగా త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు, బాలయ్య ఒకే ఫ్రేమ్‌లో కనిపించడానికి రెడీ అవుతున్నారు.

    Mahesh Babu

    ‘అన్ స్టాపబుల్’ షోలో మహేష్ బాబు గెస్టుగా కనిపించ నున్నారు. మహేష్ షో కి వస్తారనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వినిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ 4న (శనివారం) నిజంగానే  ప్లాన్ చేశారు ఆహా టీమ్. హైద‌రాబాద్‌లోని ఓ స్టూడియోలో ‘అన్ స్టాప‌బుల్‌’ షో కోసం స్పెష‌ల్‌గా వేసిన సెట్‌లో షూటింగ్ చేయనున్నారు అని తెలుస్తుంది.

    Also Read: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్…

    బాలకృష్ణ, మహేష్ బాబు మధ్య బాండింగ్ బయటకు వచ్చిన సందర్భాలు తక్కువ. అందుకని, ఈ షో కోసం అటు నందమూరి, ఇటు ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షోలో ఎన్టీఆర్, కృష్ణ మధ్య జరిగిన సరదా సంఘటనలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కార్యక్రమానికి మహేష్ అతిథిగా వచ్చారు. అప్పుడు అబ్బాయ్‌ షోకు వెళితే… ఇప్పుడు బాబాయ్ షోకు రానున్నారు మహేష్. అలానే ‘అఖండ’ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని మహేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: పాపం.. ఉప్మా సినిమాకు బిర్యానీ మాటలెందుకో ?