CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకేలా ఉంటారు. అధికారమున్నా లేకపోయినా సాధారణ వ్యక్తిలాగే ఉండటం చూస్తుంటాం. ప్రజల్లో కలిసిపోవడంలో ఆయనది ప్రత్యేకమైన విధానం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. కానీ సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించలేదనే విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఆ జిల్లాలు చుట్టి వచ్చారు. అక్కడ జరిగిన నష్టాన్ని చూసి చలించిపోయారు.
ప్రజలకు నేనున్నానని భరోసా కల్పించారు. కడప, చిత్తూరు జిల్లాల్లో జరిగిన పర్యటనలో జగన్ పలు ప్రాంతాలను సందర్శించారు. నష్టాన్ని అంచనా వేయాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. అయితే ఆ పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జగన్ పర్యటన ఎప్పుడు చేసినా ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇక్కడ కూడా జరగడం యాదృచ్చికం కాదు.
Also Read: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి కుర్చీ లాక్కునే వాడిని.. చంద్రబాబుతో రోశయ్య వ్యాఖ్యలు వైరల్
వరద బాధితులతో మాట్లాడే సమయంలో ఓ బాధితుడు వినతిపత్రం అందజేశాడు. దానిపై సంతకం చేసే సమయంలో జగన్ సంతకం పెట్టాల్సిన సందర్భంలో ఓ అధికారి పెన్ ను అందించగా అది పని చేయలేదు. దీంతో ఆయన విసుక్కోలేదు. మర్యాదగా ఆయన జేబులో పెట్టి అక్కడే ఉన్న మరో పెన్ ను తీసుకుని సంతకం చేశారు.
దీంతో అక్కడున్న వారందరు ఆశ్చర్యపోయారు. జగన్ అంటే ఇంత సాధారణంగా ఉంటారా? అని అందరిలో సంశయాలు వచ్చాయి. ఈ సన్నివేశం చూసిన వారందరు జగన్ చేసిన దానికి ఫిదా అయిపోయారు. ఆయనలో ఉన్న గొప్ప గుణానికి జై కొట్టారు. జగనన్న జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడున్న వారంతా గొంతు కలిపారు. అదే జగనన్న స్టైల్ అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.