దేశంలో సెకండ్ వేవ్ తగ్గినట్లేనా?

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయా? అంటే నిజమే అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేసుల విషయంలో లెక్కలు దోబూచులాడుతున్నాయి. రోజుకో విధంగా కేసులు నమోదవుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మే 6న రికార్డు స్థాయిలో 4.14 లక్షల కేసులు నమోదై ఆందోళనకు గురిచేసింది. మే 24న తొలిసారిగా 2 లక్షల కంటే తక్కువగా 1.96 లక్షల కేసులు నమోదయ్యాయి. మే 25న 2.08 లక్షలు, మే26న 2.11 లక్షల కేసులు నమోదు కావడం […]

Written By: Srinivas, Updated On : May 30, 2021 5:54 pm
Follow us on

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయా? అంటే నిజమే అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో కేసుల విషయంలో లెక్కలు దోబూచులాడుతున్నాయి. రోజుకో విధంగా కేసులు నమోదవుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మే 6న రికార్డు స్థాయిలో 4.14 లక్షల కేసులు నమోదై ఆందోళనకు గురిచేసింది. మే 24న తొలిసారిగా 2 లక్షల కంటే తక్కువగా 1.96 లక్షల కేసులు నమోదయ్యాయి. మే 25న 2.08 లక్షలు, మే26న 2.11 లక్షల కేసులు నమోదు కావడం చూస్తుంటే రోజుకో విధంగా కరోనా కేసులు బయటపడుతున్నాయి.

భారత్ లో మూడు రోజుల తరువాత కరోనా కేసుల సంఖ్య తగ్గుదల కనిపిస్తోంది. శనివారం 1,65,553 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 3,460 గా గుర్తించారు. రోజువారీ మరణాల రేటు ఐదు రోజుల కనిష్ట స్థాయికి స్థాయికి పడిపో వడం కూడా శుభ పరిణామమే. భారత్ లో రోజుకు నమోదవుతున్న కేసుల సంఖ్య 2.79 కోట్లకు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 3,25,972.

గణాంకాలు చూస్తుంటే సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల్లో పరిస్థితులు కూడా ప్రమాదకరంగా లేవని చెబుతున్నారు. గతంలో ఆస్పత్రి బెడ్ కావాలంటే రికమండేషన్లు ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. రెమిడెసివర్ ఇంజక్షన్ల కసం క్యూలైన్లు కనిపించేవి. బ్లాక్ దందా సైతం కొనసాగింది. ఆక్సిజన్ ధర కూడా దిగొచ్చింది. ఆక్సిజన్ పెద్ద సిలిండర్ ధర గతంలో రూ.2 వేల నుంచి3 వేల వరకు ఉండగా ప్రస్తుతం రూ.600 మాత్రమే ఉంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొవిడ్ ఆంక్షల సడలింపుకు మాత్రం రాష్ర్ట ప్రభుత్వాలు ఉత్సాహం చూపించడం లేదు. కొన్ని రాష్ర్టాలు మాత్రమే సడలింపులకు మొగ్గు చూపుతున్నాయి. మెజార్టీ రాష్ర్టాలు కర్ఫ్యూ కొనసాగించడానికే ఇష్టపడుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కొనసాగింపుకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.