NTR vs Ram Charan vs Allu Arjun Dance Comparison: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. వాళ్ళు చేసిన సినిమాలతో వాళ్లకంటే ముందున్న హీరోలను బీట్ చేసి ముందుకు దూసుకుపోవాలనే ఉద్దేశ్యంతో స్టార్ హీరోలైతే ఉంటారు. ఇక ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్నవారు సైతం మరిన్ని సూపర్ సక్సెస్ లను సాధించి తమ పొజిషన్ ను టాప్ లోనే ఉంచుకోవాలి అనే రేంజ్ లో ఆలోచిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య డాన్సులపరంగా విపరీతమైన పోటీ ఉంది.
Also Read: మన్మోహన్ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్!
వీళ్ళు ముగ్గురు ఎలాంటి కష్టమైన స్టెప్పులైనా సరే అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న హీరోలు…వీళ్లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్…ముఖ్యంగా అల్లు అర్జున్ డిఫరెంట్ స్టెప్పులను వేస్తుంటాడు. రామ్ చరణ్ ప్రతి స్టెప్ ని చాలా స్టైలిష్ గా కట్ చేస్తూ ఉంటాడు. ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి స్టెప్పునైనా సరే తన స్టైల్ లోకి మార్చుకొని దానిని సింగిల్ టేక్ లోనే చేయడానిక్ ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్ ల కంటే రామ్ చరణ్ చేసే డాన్స్ లో చాలా క్లారిటీగా ఉంటుందని ఆయన వేసే స్టెప్ చాలా పర్ఫెక్ట్ గా కట్ చేస్తారని చాలా మంది చెబుతుంటారు. దానిని ఏ టైం లో ఎలా కట్ చేయాలి అనేది కూడా అతనికి బాగా తెలుసని చాలా మంది చెబుతుంటారు. టాప్ కొరియోగ్రాఫర్లు సైతం అతని కోసం ససపరేట్ గా కొన్ని స్టెప్స్ డిజైన్ చేస్తూ ఉంటారు…
నిజానికి డ్యాన్స్ ను పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేయాలి, దానికి ఎండింగ్ ఎలా ఇవ్వాలి అనేది చాలా కీలకపాత్ర వహిస్తుందనే ఆ విషయంలో రామ్ చరణ్ ముందు వరుసలో ఉన్నాడు. అందుకే వాళ్ళిద్దరి కంటే కూడా రామ్ చరణ్ డాన్స్ లో చాలా క్వాలిటీ ఉంటుందని ఆయన వేసే స్టెప్స్ ఒకదానికి ఒకటి రిలేటెడ్ గా ఉంటాయి. అందుకే అవి ప్రేక్షకులకు బాగా సింక్ అవుతుంటాయని చాలామంది కొరియోగ్రాఫర్లు సైతం చెబుతూ ఉంటారు…
