ఇటీవల యూపీ, బీహార్ లోని గంగానదిలో మృతదేహాలు తేలియాడుతుండడం చూసి దేశవ్యాప్తంగా అందరూ షాక్ అయ్యారు. అవన్నీ కోవిడ్ మృతదేహాలు అని అందరూ అనుమానించారు. అయితే గంగానదిలో శవాలను వదిలేస్తుంటారని.. అవి కావని కొందరు సర్ధి చెప్పారు. కానీ తాజాగా గంగానదిలో వచ్చినవి కోవిడ్ మృతదేహాలనేనన్న నిజం బయటపడింది. ఒక కోవిడ్ డెడ్ బాడీని నదిలో విసిరేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కు వేల సంఖ్యలో బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం దహనం చేయడానికి శ్మశానాల్లో ఖాళీ లేని పరిస్థితి. క్యూలో శవాలను ఉంచలేక.. కాల్చలేక చాలా మంది నదుల్లో పడేశారని తేలింది.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ నదిలో మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగుచూసింది. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు విచారణ జరిపారు. ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ జిల్లాలోని రఫ్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. పీపీఈ కిట్ ధరించి ఓ వ్యక్తి.. మరో వ్యక్తి మాస్క్ తో ప్యాక్ చేసిన కోవిడ్ మృతదేహాన్ని నదిలోకి జారవిడుస్తున్నట్టుగా ఆ వీడియోలో కనిపించింది.
అదే సమయంలో కారులో వెళ్తున్న కొందరు ఈ వీడియోను తీశారు. అధికారుల దృష్టికి వెళ్లగా విచారణ జరిపి నదిలో విసిరేసింది కోవిడ్ మృతదేహామేనని తేల్చారు. చనిపోయిన వ్యక్తి బంధువులే నదిలో పడవేసినట్టుగా అధికారులు గుర్తించారు. వారిపై కేసులు నమోదు చేశారు.
అప్పట్లో కరోనా కల్లోలం ఉండడం.. తుఫాన్ సంభవించిన వేళ ఖననానికి ఇబ్బందులు ఎదురై చాలా కోవిడ్ శవాలను నదిలో విసిరేసినట్టుగా తెలుస్తోంది. బీహార్ లోని బక్సర్ జిల్లాలో ఒకేసారి 71 మృతదేహాలు నదిలో కొట్టుకురావడం ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికీ నదుల్లో మృతదేహాలు కనిపిస్తూనే ఉండడం గమనార్హం.
शर्मनाक!
प्रदेश में स्वास्थ्य विभाग के बदहाली की पोल खुल चुकी है।
बलरामपुर में राप्ती नदी में PPE किट में सरेआम डेड बॉडी फेंकी जा रही है।@myogiadityanath जी टीम लगा दीजिये इसको भी झूठा साबित करने के लिये। pic.twitter.com/bKfhGxXdj2
— UP Congress (@INCUttarPradesh) May 30, 2021