నైరుతి మరో రెండు రోజల ఆలస్యం

నైరుతి రుతు పవనాలు మరో రెండు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్ 3న ఇవి తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మొహాపాత్ర వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి మరింత బలడతాయని, దీంతో కేరళలో వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతు ప వనాలు […]

Written By: Suresh, Updated On : May 30, 2021 5:57 pm
Follow us on

నైరుతి రుతు పవనాలు మరో రెండు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్ 3న ఇవి తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఎం మొహాపాత్ర వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి మరింత బలడతాయని, దీంతో కేరళలో వర్షాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. నైరుతి రుతు ప వనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించాక నాలుగు నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.