Delhi Metro Employee: ఢిల్లీ మెట్రో ఉద్యోగి ప్రపుల్ సింగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో అత్యంత ఎక్కువ ప్రయాణించిన వ్యక్తిగా ఈ ఘనత సాధించాడు. 16.02 గంటల్లో మెట్రో మెట్రో పరిధిలోని 348 కి.మీల ప్రయాణాన్ని చేసి 254 స్టేషన్లు తిరిగిన వ్యక్తిగా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

తాజాగా ప్రపుల్ సింగ్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ట్విట్టర్ ఈ మేరకు ఓ పోస్ట్ చేసింది. మెట్రో స్టేషన్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్/అవార్డ్ పట్టుకుని ఉన్న ప్రఫూల్ సింగ్ ఫొటోను షేర్ చేసింది. ‘ప్రఫుల్ సింగ్ వేగవంతమైన రికార్డ్ నమోదు చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించాడు. 254 మెట్రో స్టేషన్‌లను కేవలం 16 గంటల 2 నిమిషాల వ్యవధిలో 348 కి.మీలను అధిగమించిన మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు.’’ అని పేర్కొంది.
Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ లో ఊహకు అందని సర్ ప్రైస్ పెట్టిన జక్కన్న.. మరో లెవల్ లో ఉంటుందట
ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ప్రపూల్ సింగ్ ఉన్నత అధికారుల అనుమతి కోరినట్లు తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రపూల్ సింగ్ ఆగస్టు 29న ఈ ఛాలెంజ్ తీసుకున్నాడు.
“నేను చాలా కాలంగా ఢిల్లీ మెట్రోను ఉపయోగిస్తున్నాను కాబట్టి నాకు అన్ని లైన్ల గురించి తెలుసు. రికార్డును నెలకొల్పడానికి ఏ స్టేషన్.. లైన్ నుండి ప్రారంభించాలో ఎక్కడ ముగించాలనేది తెలిసి ఈ రికార్డ్ సాధించానని ”అని ప్రపూల్ సింగ్ తన ఘనతను చాటిచెప్పాడు.
“అన్ని మెట్రో స్టేషన్లలో ‘పటేల్ చౌక్ (లైన్-2)’ నాకు ఇష్టమైనది. ఎందుకంటే ఇందులో చిన్న మ్యూజియం ఉంది. భారతదేశంలోని మొట్టమొదటి ఆధునిక రవాణా సౌకర్యం ఉన్న మెట్రో కేవలం ఢిల్లీదేనని ప్రపూల్ సింగ్ గర్వంగా తెలిపాడు.
Also Read: TRS Party Dissent: టీఆర్ఎస్ లో అసంతృప్తి మంటలు.. అంటుకోవడం ఖాయమా?