
Corona Third Wave: కరోనా మూడో దశ ముప్పు వచ్చిందా అంటే నిజమే అనే మాటలు వినిపిస్తున్నాయి. దేశంలో కొన్ని స్టేట్లలో థర్డ్ వేవ్ లక్షణాలు అప్పుడే కనిపిస్తున్నాయి. కేరళలో మొదటి నుంచి కరోనా కేసులు తగ్గకపోగా ఇప్పుడు మరింత పెరిగాయి. మొదటి, రెండో దశల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోయాయి. మొదటి దశలో వృద్ధులు, రెండో దశలో యువకులు ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. ఇన్నాళ్లు కరోనా మూడో దశ ముప్పు తప్పిందని భావించినా ప్రస్తుతం కొత్త కేసులు పెరుగుతుండడం చూస్తుంటే థర్డ్ వేవ్ మొదలైందనే తెలుస్తోంది.
మహారాష్ర్ట, కేరళలో పెరుగుతున్న కేసులతో మూడో దశ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఇంకా నాగపూర్, పూణే వంటి నగరాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మూడో దశ ప్రారంభమైందని చెబుతున్నారు. దీంతో దేశంలో కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. మూడో దశ ముప్పుపై శాస్ర్తవేత్తలు ఇప్పటికే హెచ్చరికలు చేస్తున్న సందర్భంలో కేసులు పెరగడం చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో కేరళలో 80 శాతం, మహారాష్ర్ట, ఈశాన్య భారత్ లో ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళలో శుక్రవారం 25 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలోని యాక్టివ్ కేసుల్లో 61 శాతం కేరళలో ఉంటున్నాయి. దీంతో మూడో దశ ముప్పు ప్రారంభమైందని తెలుస్తోంది. సెప్టెంబర్ లో సగటున ప్రతి రోజు సుమారు 40 వేల కేసులు రావడంతో మూడో దశ ప్రారంభం అయిందని నిపుణులు చెబుతున్నారు.
ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం జులైలో నిర్వహించిన ఒక సర్వేలో కేరళలో 44 శాతం మందిలో మాత్రమే యాంటీ బాడీస్ ఉన్నట్లు తెలుస్తోంది. సెరో సర్వేలో మహారాష్ర్టలో 58 శాతం మందిలో మాత్రమే సరోపోసిటివిటీ కనుగొనబడింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్, గుజరాత్, చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ 70 శాతం ప్రజల్లో యాంటీబాడీలు కనిపించాయి. రోగనిరోధక శక్తికి 85 శాతం జనాభాలో యాంటీబాడీ ఉత్పత్తి అవసరం అని గుర్తించారు.