
టీపీసీసీ చీఫ్ రేవంత్ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ దళితులను, గిరిజనులను మోసం చేశాడని ఆరోపించారు. ఏడున్నర ఏళ్లలో కేసీఆర్ చేతిలో దళిత, గిరిజనులు దగా పడ్డారని మండిపడ్డారు. గజ్వెల్ లో జరగబోయే సభ ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు. కేసీఆర్ చట్టాలను అమలు చేసి ఉంటే, ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే దళిత, గిరిజనులు ఎక్కువ లబ్ధి పొందేవారని అన్నారు. ఇందిరా గాంధీ మెదక్ ఎంపీ గా గెలిపిస్తే దేశంలోనే అధిక పరిశ్రమలు వచ్చాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. అందుకు ఇందిరా గాంధీ గారికి మెదక్ ప్రజల అండగా నిలబడడం వల్లనే అయ్యిందని తెలిపారు.