దేశంలో మళ్లీ కరోనా కల్లోలం తప్పదా?

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైరస్ మెల్లమెల్లగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఇండియాలో కొత్తగా 39,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కి చేరింది. కొత్తగా 535 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,20,551కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా మారింది. ప్రపంచ దేశాల్లో 2.14 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 39,972 మంది రికవరీ […]

Written By: Srinivas, Updated On : July 25, 2021 12:12 pm
Follow us on

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అలజడి రేపుతోంది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైరస్ మెల్లమెల్లగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఇండియాలో కొత్తగా 39,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ. మొత్తం కేసుల సంఖ్య 3,13,71,901కి చేరింది. కొత్తగా 535 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,20,551కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా మారింది.

ప్రపంచ దేశాల్లో 2.14 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 39,972 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,05,43,138కి చేరింది. రికవరీ రేటు 97.4 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్ లో 4,08,212 యాక్టివ్ కేసులున్నాయ. దేశవ్యాప్తంగా కొత్తగా 17,18,756 టెస్టులు చేశారు. భారత్ లో ఇప్పటి వరకు 45.62,80,567 టెస్టులు చేశారు. కొత్తగా 51,18,210 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 43,31,50,864 మందికి వ్యాక్సిన్లు వేశారు.

దేశంలో యాక్టివ్ కేసులు 765 తగ్గాయి. కొత్తకేసులు వరుసగా మూడో రోజు 40 వేల కంటే తక్కువ వచ్చాయి. వరుసగా28వ రోజు 50 వేల కంటే తక్కువ కేసులు వచ్చాయి. దేశంలోనే ఎక్కువగా కేరళలో కొత్త కేసులు 18.6 వేలు వచ్చాయి. ఆ తరువాత మహారాష్ర్టలో 6.3 వేలు, ఆంధ్రప్రదేశ్ లో 2.2 వేలు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా మహారాష్ర్టలో 224 మంది చనిపోయారు. కేరళలో 98 మంది, ఒడిశాలో 68 మంది చనిపోయారు.

ప్రస్తుతం 15 స్టేట్లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. టెస్టుల పాజిటవిటీ రేటు 2.31 శాతం ఉంది. ఇది వరుసగా 34వ రోజు 3 శాతం కంటే తక్కువే ఉంది. మణిపూర్ లో 18.78 శాతం, కేరళలో 13.63 శాతం, సిక్కింలో 13.27 శాతం పాజిటవిటీ రేటు ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా 74,720 టెస్టులు చేయగా కొత్తగా 2,174 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 19,52,513కు చేరింది. కొత్తగా 18 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,241కి పెరిగింది. కొత్తగా 2,737 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,16,914కి చేరింది. ప్రస్తుతం 22,358 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ర్టంలో ఇప్పటి వరకు 2,40,50,103 టెస్టులు జరిగాయి.