https://oktelugu.com/

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గం సుగమం చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందించేందుకు సంకల్పించింది. ఆగస్టు నుంచి వారికి రేషన్ కోటా ఇవ్వాలని భావిస్తోంది. దీంతో అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 25, 2021 / 11:52 AM IST
    Follow us on

    తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గం సుగమం చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందించేందుకు సంకల్పించింది. ఆగస్టు నుంచి వారికి రేషన్ కోటా ఇవ్వాలని భావిస్తోంది. దీంతో అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఇప్పటికే పలువురు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకకు జులై 26 నుంచి 31 వరకు రేషన్ కార్డుల పంపిణీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జూన్ లోనే మొదలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 4,46,169గా ఉంది. వీటిని అన్ని కోణాల్లో పరిశీలించి రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు.

    ప్రభుత్వం విధించిన నిబంధనలను పరిశీలించి 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. హైదరాబాద్ లో 56,064 మంది అర్హులు, రంగారెడ్డిలోో 35,88 మంది, మేడ్చల్ లో 30,055 మంది అర్హులుగా గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అర్హులందరికి త్వరలో రేషన్ కార్డుల జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్లు రేషన్ అందకుండా పోయిన పేదలకు లబ్ధి చేకూరనుంది.

    ప్రభుత్వం నిర్ణయంతో సామాన్యులకు లాభం కలగనుంది. రేషన్ సరుకుల కోసం ఎదురు చూసిన వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. కాయకష్టం చేసినా బుక్కెడు బువ్వ కోసం నానా తిప్పలు పడుతున్న వారి కష్టాలు ఇక తొలగిపోనున్నాయి. ప్రభుత్వ నిర్వాకంతో పేదలకు మేలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ఇకనైనా సర్కారు వారి బాధలు గమనించి వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం ప్రయోజనమే.