
ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో వైకాపా ఏడు, తెదేపా ఒక డివిజన్ లో విజయం సాధించాయి. 2, 33, 38, 39, 41, 42, 46, డివిషన్లలో వైకాపా గెలుపొందగా 37వ డివిజన్ లో తెదేపా అభ్యర్థి విజయం సాధించారు. 2వ డివిజన్ లో వైకాపా అభ్యర్థి జి. శ్రీనివాసరావు 788 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.