మరోసారి విజృంభిస్తున్న కరోనా..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో గతంలో మాదిరిగానే మహారాష్ట్రలో కేసులు పెరిగిపోతున్నాయి. అప్రమత్తమైన సర్కారు కరోనా కట్టడికి సర్వం సిద్ధం చేస్తోంది. ముంబయిలో కరోనా రోగుల సంఖ్యను బట్టి ఆస్పత్రులలో బెడ్ల కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అవసరాన్ని బట్టి 75వేల బెడ్లను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ ప్రకటించింది. అందుబాటులో ఉన్న సుమారు 27వేల బెడ్లలో 50శాతం ఖాళీగా ఉన్నాయని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. Also Read: ఆ ప్రాంతంలో మరోసారి […]

Written By: Srinivas, Updated On : March 21, 2021 5:03 pm
Follow us on


దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో గతంలో మాదిరిగానే మహారాష్ట్రలో కేసులు పెరిగిపోతున్నాయి. అప్రమత్తమైన సర్కారు కరోనా కట్టడికి సర్వం సిద్ధం చేస్తోంది. ముంబయిలో కరోనా రోగుల సంఖ్యను బట్టి ఆస్పత్రులలో బెడ్ల కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అవసరాన్ని బట్టి 75వేల బెడ్లను సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంసీ ప్రకటించింది. అందుబాటులో ఉన్న సుమారు 27వేల బెడ్లలో 50శాతం ఖాళీగా ఉన్నాయని ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: ఆ ప్రాంతంలో మరోసారి లాక్ డౌన్.. మార్చి 31 వరకు పాఠశాలలు మూసివేత..!

పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్యకు అనుగుణంగా నగరంలో అక్కడక్కడ కరోనా కేర్ సెంటర్లు, ఏడు చోట్ల జంబో సెంటర్లలో ఇలా సుమారు 75వేలకు పైగా బెడ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. మే మొదలుకుని ఆగస్టు, సెప్టెంబరు వరకు రికార్డుస్థాయిలో కేసులు పెరిగాయి. డిసెంబర్ నుంచి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జనవరిలో రోజుకు 500 కన్నా తక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరిలో కేసుల సంఖ్య పెరగడం మళ్లీ మొదలైంది. సుమారు రోజుకు రెండువేలకు పైగా కొత్తకేసులు నమోదు అవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 3వేలకు పైగా నమోదు అయ్యాయి.

Also Read: ఒకే డోసుతో కరోనా ఖతం..

గతేడాది మహారాష్ట్రలో వైరస్ వచ్చినప్పటి నుంచి పెరుగుతున్న కేసులకు అనుగుణంగా ప్రభుత్వం హెల్త్ సెంటర్లను సిద్ధం చేసింది. అయితే ఒకానొక సమయంలో కరోనా కేసులు తగ్గిపోవడంతో చాలా వరకు సెంటర్లు మూసివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూసివేసిన సెంటర్లను తెరుస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైనా.. ఎదుర్కొనేందుకు బీఎంసీ సిద్ధంగా ఉందని, రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ అధికారి తెలిపారు.

మహారాష్ట్ర పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. కొద్దిరోజులుగా చాపకింద నీరులా కరోనా వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ప్రారంభమైన తరగతులు.. తెరుచుకున్న హాస్టళ్ల నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయి. కరీంనగర్, మంచిర్యాల జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అదే విధంగా సింగరేణిలోనూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. నివారణకు చర్యలు చేపడుతోంది. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.