జాతిరత్నాలు కలెక్షన్ల సునామీ.. ఇప్పటివరకు ఎంతంటే?

జాతిరత్నాలు మేనియా కొనసాగుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద సినిమాలు నమోదు చేయలేని రికార్డులను సొంతం చేసుకుంటోంది. సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పెద్ద స్టార్లు లేకపోయినా.. పేరున్న దర్శకుడు కాకపోయినా ప్రేక్షకుల నుంచి ఆదరణను అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు బద్దలు కొడుతోంది. జాతిరత్నాలు మూవీ ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, […]

Written By: NARESH, Updated On : March 21, 2021 1:55 pm
Follow us on

జాతిరత్నాలు మేనియా కొనసాగుతోంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ పెద్ద సినిమాలు నమోదు చేయలేని రికార్డులను సొంతం చేసుకుంటోంది. సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పెద్ద స్టార్లు లేకపోయినా.. పేరున్న దర్శకుడు కాకపోయినా ప్రేక్షకుల నుంచి ఆదరణను అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలోనే భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు బద్దలు కొడుతోంది.

జాతిరత్నాలు మూవీ ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. అనుదీప్ కేవీ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు.

ఈ మూవీ నైజాంలో రూ.3 కోట్లు, సీడెడ్ లో రూ.1.50 కోట్లు, ఆంధ్రాలో రూ.4.55 కోట్లు, ఓవర్సీస్ , కర్ణాటక ప్లస్ ఓవర్సీస్ కలిపి రూ.1.5 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.10.80 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది.

తాజాగా ఆంధ్ర, నైజాంలో శుక్రవారం రూ.1.02 కోట్లు షేర్, రూ.1.50 కోట్లు గ్రాస్ వచ్చింది. గత ఎనిమిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.25.34 కోట్ల షేర్, రూ.40.30 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.30.14 కోట్లు షేర్ తో రూ.49.65 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు హిట్ టాక్ రాకపోవడంతో వాటిని సైతం జాతిరత్నాలు భారీ దెబ్బతీసింది.

రూ.10.80 కోట్ల బిజినెస్ చేసి ఈ మూవీ ఏకంగా తాజాగా 30.14 కోట్లు వసూలు చేయడంతో ఇప్పటికే రూ.18.64 కోట్లు లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.