Chandrayaan 3 Lander: చంద్రయాన్ -3 ప్రయోగంలో భాగంగా ఆసక్తి విషయం బయటపడింది. నాలుగేళ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్ 2కు సంబంధించిన ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి కక్ష్యలోనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి సంబంధించిన ల్యాండర్ కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాగతం పలికింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రెండింటినీ అనుసంధానించారు. జాబిల్లిపై అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న తరుణంలో అప్పటి ఆర్బిటర్ ఎదురుకావడంతో సోమవారం ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
చంద్రయాన్-2 ను 2019 ఆగస్టు 14 జాబిల్లి పైకి పంపారు. ఆగస్టు 20 విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయాణంలో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్యఓాన్ రోవర్ కలిసి వెళ్లాయి. అన్ని కక్ష్యలు పూర్తి చేసుకున్న తరువాత జూలై 22న మధ్యాహ్నం 2.43 నిమిషాలకు చంద్రుడిపై దిగేలా సెట్ చేశారు. ప్లాన్ ప్రకారమే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లాక ఆర్బిటర్ , ల్యాండర్ విడిపోయాయి. ల్యాండర్ చంద్రుడి పై 2.1 కిలోమీటర్ ఉండగా ఆర్బిటర్ కు సమాచార సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగూతూనే పరిభ్రమిస్తుంది.
ఇక తాజాగా చంద్రయాన్ 3 విజయవంతం కావాలని భారత్ ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఇప్పటి వరకు సాఫీగా ల్యాండర్, ఆర్బిటర్ విడిపోయాయి. ఇక బుధవారం సాయంత్ర 6 గంటలకు చంద్రుడిపై దిగేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చంద్రయాన్ 2 విఫలమైన తరువాత మరింత టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రయోగం చేశారు. ఈసారి విఫలం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగంపై మరింత ఆసక్తి పెరిగింది.