Nithin Nabin BJP leader: భారతీయ జనతాపార్టీ.. 12 ఏళ్లుగా దేశంలో అధికారంలో ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా అధికారంలో ఉంది. ఇదంతా పార్టీ నేతల సమష్టి కృషితోనే సాధ్యమైంది. ఇందులో మోదీ మానియా కూడా తోడైంది. అయితే ఇప్పుడు ఉన్న నేతలంతా వయసులో పెద్దవారు. దీంతో పార్టీలో యువ నాయకత్వం నిపండానికి పార్టీ ఏడాదిగా కసరత్తు చేస్తోంది. తాజాగా పార్టీ నిర్ణయం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. బిహార్‌కు చెందిన యువ నాయకుడు నితిన్ నబీన్ సిన్హాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఢిల్లీలో సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు ఉన్నా.. ఈ ఆశ్చర్యకరమైన నిర్ణయం పార్టీ దీర్ఘకాల దృష్టిని తెలియజేస్తోంది.
మీడియా ఊహలు ఫెయిల్..
తెలుగు మీడియా తమ ఎంపీల్లో ఒకరు జాతీయ స్థాయి అధ్యక్షుడు అవుతారని ప్రకటించింది. కానీ పార్టీ నబీన్ పనితీరును గమనించి ముందుకు తీసుకుంది. జేపీ నడ్డా లాగా, మొదట వర్కింగ్ రోల్, తర్వాత పూర్తి నాయకత్వం. ఈ మార్పు ఆర్గనైజేషన్‌లో తాజా శక్తిని పోషిస్తుందని పార్టీ క్యాడర్ ఆశిస్తోంది.
2029 వరకు యువ నాయకత్వం..
ప్రస్తుత నాయకుల వయసు 2029 నాటికి సీనియర్ స్థాయికి చేరుకుంటుంది. అందుకే బీజేపీ యువతను ప్రమోట్ చేస్తోంది. నితిన్ నబీన్ ముగ్గర ఎన్నికలను నడిపే కెపాసిటీ కలిగినవాడు. రాష్ట్రాలంతటా యువ నాయకులకు స్థిరమైన అవకాశాలు తలెత్తుతాయి – ఇది దేశవ్యాప్త మార్పు సూచన.
నబీన్ ట్రాక్ రికార్డ్..
తండ్రి నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా పార్టీ సీనియర్ నాయకుడు. నితిన్ 2000 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, బిహార్ మంత్రిగా పనిచేశారు. చత్తీస్‌గఢ్, సిక్కిమ్‌లో ఎన్నికల విజయాలు చేపట్టారు. యువ మోర్చా జాతీయ కీలక పదవిలో కార్యక్రమాలు రూపొందించారు. 20 ఏళ్లు డైనమిక్‌గా నడిపే స్టామినా ఆయనలో కనిపిస్తుంది.
లాంగ్ టర్మ్ విజన్‌తో కొత్త తరం..
ఒక ఏడాది కసరత్తు తర్వాత ఈ నిర్ణయం జరిగింది. 20 ఏళ్ల భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకుని పార్టీ చర్య తీసుకుంది. అధ్వానీ దశలో యువులు ఎదిగినట్టు, ఇప్పుడు కొత్త రక్తానికి దేశవ్యాప్త బాధ్యతలు వస్తాయి. ఈ స్ట్రాటజీ పార్టీని మరింత శక్తివంతం చేస్తుంది.