Maharashtra BJP: భారతీయ జనతా పార్టీ మనదేశంలో గడిచిన దశాబ్దానికి మించి అధికారంలో ఉంది. ప్రస్తుతం కూడా అధికారంలో కొనసాగుతోంది. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విజయవంతంగా పరిపాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు రకరకాల శాపనార్థాలు పెట్టినప్పటికీ విజయవంతంగా దూసుకుపోతున్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి కొన్ని పార్టీలు సహకరించినప్పటికీ.. ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
ఇటీవల కాలంలో నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే ఏకంగా ఓట్ చోర్ అంటూ మండిపడుతున్నారు. ఓట్లను చోరీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా నరేంద్ర మోడీకి జేబులో సంస్థగా మారిందని విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు విభిన్న విధానాలలో నరేంద్ర మోడీపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ముంబైలోని 75 సంవత్సరాల ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రధాని విమర్శించారు. చీర కట్టినట్టు ఉన్న మోదీ మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోను షేర్ చేసిన ఆ కాంగ్రెస్ కార్యకర్త పేరు ప్రకాష్ పగారే. అతడు చేసిన పని పట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని గుర్తించి ఏకంగా విమర్శలు చేశారు. ప్రధానమంత్రి పై అంతటి దారుణానికి పాల్పడతావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రధానమంత్రిని విమర్శిస్తూ.. చీర కట్టినట్టు ఉన్న మార్ఫింగ్ ఫోటో మాదిరిగానే అతడికి కూడా అలాంటి సన్మానమే చేశారు. ప్రకాష్ ను పట్టుకుని బలవంతంగా చీర కట్టారు. అంతే కాదు మరో సారి ఇలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. జరిగిన సంఘటన పై పోలీసులు కు ఫిర్యాదు చేయకుండా..చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది.
DON’T MISS THIS!
A टुच्चा CONgress leader Prakash alias ‘Mama’ Pagare had mocked PM Modi Ji by sharing a morphed photo of him wearing a saree on social media.
Today he was ‘honoured’ by the BJP workers of Kalyan district by making him wear a saree. pic.twitter.com/4OS4wdcRvk
— BhikuMhatre (@MumbaichaDon) September 23, 2025