https://oktelugu.com/

బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. అరగంటలో తక్కువ వడ్డీతో రుణం తీసుకునే ఛాన్స్..?

దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. రుణం కోసం దరఖాస్తు తీసుకున్న వారికి అరగంటలోనే రుణం మంజూరు చేయనుంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ ద్వారానే కస్టమర్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ సర్వీసుల పేరుతో కొత్త సర్వీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా అందుబాటులోకి తెచ్చింది. Also Read: ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నారా.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 29, 2020 / 02:38 PM IST
    Follow us on


    దేశంలోని ప్రముఖ బ్యాంకులలో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం తీసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. రుణం కోసం దరఖాస్తు తీసుకున్న వారికి అరగంటలోనే రుణం మంజూరు చేయనుంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ ద్వారానే కస్టమర్లు లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ సర్వీసుల పేరుతో కొత్త సర్వీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా అందుబాటులోకి తెచ్చింది.

    Also Read: ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నారా.. ఆ తప్పు చేస్తే మోసపోయే ఛాన్స్..?

    కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో చాలామంది బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆన్ లైన్ లోనే బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్ తీసుకునే అవకాశం కల్పించడంతో పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్ తీసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు లోన్ కోసం దరఖాస్తు చేసుకుని అర్హత ఉంటే తక్కువ సమయంలోనే లోన్ పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారికి సైతం శుభవార్త చెప్పింది.

    Also Read: పన్ను చెల్లింపుదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. ఫ్రీగా ఆ సర్వీసులు..!

    కార్ లోన్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకునే వారు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రుణం తీసుకుంటే మంచిది. ప్రభుత్వ రంగ బ్యాంక్ కావడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇతర బ్యాంకుల కంటే తక్కువ మొత్తం ఛార్జీల రూపంలో తీసుకుంటోంది. డిజిటల్ మార్గంలో ఇచ్చే రుణాల వాటాను పెంచాలని బ్యాంక్ ఆఫ్ బరోడా భావిస్తుండటం గమనార్హం. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ ద్వారా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

    మరిన్ని వార్తల కోసం ప్రత్యేకం

    సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ను సంప్రదించి ఈ రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ద్వారా ఈ రుణాలకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా పొందవచ్చు.