HomeజాతీయంRam Mandir: రామ్‌లల్లా వస్తున్నాడహో.. నేడు అయోధ్యకు బాలరాముడు

Ram Mandir: రామ్‌లల్లా వస్తున్నాడహో.. నేడు అయోధ్యకు బాలరాముడు

Ram Mandir: భారతీయ హిందువుల ఏళ్లనాటి కల మరో ఐదు రోజుల్లో సాక్షాత్కారం కాబోతోంది. హిందువుల కళ్లలో ఆనందం ఉట్టిపడే అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామరాజ్యస్థాపన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపురూప ఘట్టానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ బాల రాముడు అయోధ్యకు బయల్దేరాడు. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న రామాలయంలో కొలువుదీరనున్న రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్టకు బుధవారం అయోధ్య చేరుకోబోతున్నాడు.

వేడుకలు షురూ..
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు జనవరి 16 నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 22న అభిజిత్‌ లగ్నంలో శ్రీరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ శిల్పి అరుణ్‌యోగిరాజ్‌ తయారు చేసిన బాలరాముడి విగ్రహాన్ని రామాలయంలో ప్రతిష్టాపనకు ఎంపిక చేశారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆ విగ్రహాన్ని అయోధ్యకు తీసుకు వస్తోంది.

అందరి మదిలో నిలిచేలా..
వనవాసం వీడిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకుని పట్టాభిశక్తుడు అయినట్లుగా.. అయోధ్యలో రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించేందకు ఏర్పాట్లు చేశారు. ప్రతీ హిందువు మదిలో నిలిచేలా రామ్‌లల్లా విగ్రహాన్ని భారీ ఊరేగింపు నడుమ అయోధ్యలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటు చేసింది. బుధవారం అయోధ్యకు చేరిన బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి ప్రవేశపెట్టనున్నారు. నేడు అందరి ముంద ఆవిష్కరించే రామ్‌లల్లా విగ్రహం ఐదేళ్ల పసి బాఉలడి రూపంలో తయారుచేశారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ...

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...
Oktelugu Epaper
Exit mobile version