Homeలైఫ్ స్టైల్Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ...

Qualities Women Like In Men: ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయా.. మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు..

Qualities Women Like In Men: ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఇష్టపడడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఒక పురుషుడిని ఒక మహిళ ఏ విషయంలో ఇష్టపడుతారు? అనే సందేహం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. చాలా మంది తమ అందాన్నిలేదా డబ్బును చూసి లైక్ చేస్తారని కొందరు అనుకుంటారు. కానీ నిజంగా ఇష్డపడేవారు మాత్రం పురుషుల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలను గమనిస్తారు. ఇవి వారిలో ఉంటే ఎప్పటికీ విడిచిపెట్టరు. ముఖ్యంగా ఈ 7 క్వాలిటీస్ ఉంటే బాగా లైక్ చేస్తారని అంటున్నారు. మరి మీలో ఈ 7 క్వాలిటీస్ ఉన్నాయా? ఇంతకీ అవేంటీ?

1. ఆత్మవిశ్వాసం:
పురుషుడు తమ పనులను పూర్తి చేసుకోవడానికి ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ క్వాలిటీ ఉన్న పురుషులు మహిళలను త్వరగా ఆకట్టుకుంటారు. అయితే ఆత్మవిశ్వాసం లక్షణం అహంకారం కాకుడదు. తనకు తాను గౌరవించుకోవడంతో పాటు సరైన నిర్ణయాలు తీసుకునేదిగా ఉండాలి. తమపై తమకు నమ్మకం ఉన్న వ్యక్తి పక్కన మహిళలు సురక్షితంగా భావిస్తారు. అందుకే వీరిని బాగా ఇష్టపడుతారు.

2. ఇతరుల చెప్పే విషయాలను వినే గుణం :
చాలామంది తమ గురించి మాత్రమే మాట్లాడటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎదుటివారు చెప్పేది వినిపించుకోరు. అలా కాకుండా ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినే పురుషులు మహిళలకు బాగా నచ్చుతారు. ఎందుకంటే మహిళలు తమ ఆలోచనలను, భావాలను అర్థం చేసుకుంటూ ఓపికగా వినే వారు తమ జీవితంలో ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని భావిస్తారు.

3. సరదాగా ఉండడం:
ఎప్పుడూ కాదు గానీ.. సందర్భానికి తగినట్లుగా నవ్వించగలిగే పురుషుల వైపు మహిళలు సులభంగా ఆకర్షితులవుతారు. కష్ట సమయాల్లో కూడా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా.. కష్టాలను అధిగమించే ధైర్యంతో కూడిన స్వభావాన్ని కలిగి ఉంటే ఆ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. అయితే ప్రతీ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఉండాలి.

4. భావోద్వేగ లక్షణాలు:
ఒక్కోసారి కష్టాలు రావొచ్చు. ఇతరుల కష్టాలను కూడా అర్థం చేసుకుంటూ వారికి ధైర్యం చెప్పే వ్యక్తిగా ఉన్నవారు మహిళలకు ఎక్కువగా నచ్చుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో స్పష్టత ఉన్న పురుషులం మహిళలకు మహా ఇష్టం. కోపం లేదా ఒత్తిడి వచ్చినప్పుడు నిగ్రహంతో వ్యవహరించడం, కష్ట సమయాల్లో తోడుగా నిలిచే గుణం ఉండాలని కోరుకుంటారు.

5. లక్ష్యంతో ముందుకు వెళ్లడం:
జీవితంలో స్పష్టమైన లక్ష్యం, గమ్యం, ఆశయాలు ఉన్న పురుషులు మహిళలకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. తమ కెరీర్ లేదా ఆసక్తుల పట్ల అంకితభావంతో పనిచేసే పురుషులు భవిష్యత్తుపై ధీమాను నింపుతారు.అలాంటి వారితో జీవితం సంతోషంగా ఉంటుందని భావిస్తారు.

6. దయ:
కేవలం భాగస్వామితోనే కాకుండా, ఇతరులతో కూడా దయ గుణం కలిగి ఉండాలి. అలాగే మాట తీరు బాగుండాలి. ఇలా అందరినీ గౌరవంగా, దయతో చూసే స్వభావం ఉన్న పురుషుల వైపు మహిళల దృష్టి నిలుస్తుంది.

7. పరిశుభ్రత:
మానసికంగానే కాకుండా శరీర పరిశుభ్రతకు మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శుభ్రమైన దుస్తులు వేసుకోవడం, మంచి సువాసన వచ్చే వారిపై ఎక్కువ ఇష్టం పెంచుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...

Rajinikanth Biopic: వెండితెర పైకి సూపర్ స్టార్ రజినీకాంత్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Rajinikanth Biopic: ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదగడం అనేది సాధారమైన విషయం కాదు. కృషి , పట్టుదల ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా...

Nagarjuna: నాగార్జున తో సినిమా చేయాలంటే దర్శకుడికి ఈ క్వాలిటీస్ ఉండాల్సిందే…

Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. శివ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత...

Ram Charan : 2027 లో రామ్ చరణ్ సినిమా లేనట్టే.. అభిమానులకు గుండెలు ఆగిపోయే వార్త..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'పెద్ది' రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. #RRR తర్వాత వరుసగా...

Jana Nayagan : ‘జన నాయగన్ ‘ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. డిజాస్టర్ టాక్ తో...

Jana Nayagan : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని...
Oktelugu Epaper
Exit mobile version