Guntur Kaaram Collections: కేవలం 37 టిక్కెట్లు మాత్రమే.. మహేష్ పరువు తీసిన ‘గుంటూరు కారం’

గుంటూరు కారం మూవీ నిరాశపరిచిన నేపథ్యంలో రెండో రోజు నుండే డ్రాప్ కనిపించింది. కొన్ని సెంటర్స్ లో అత్యల్ప టికెట్స్ తెగాయి. అనూహ్యంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒక షోకి కేవలం 37 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయట.

Written By: Swathi, Updated On : January 17, 2024 11:00 am

Sankranti 2024 Movies

Follow us on

Guntur Kaaram Collections: గుంటూరు కారం 2024 సంక్రాంతి విన్నర్ అవుతుందని అనుకున్నారు. అనూహ్యంగా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ షో నుండే గుంటూరు కారం యావరేజ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. పూర్తిగా డైరెక్షన్ ఫెయిల్యూర్ కనిపించింది. కథ, కథనాల విషయంలో త్రివిక్రమ్ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సాంకేతికంగా కూడా లోపాలు ఉన్నాయి. సౌండ్ మిక్సింగ్ కుదరలేదు. ముఖ్యంగా యూఎస్ ప్రింట్ లో ఈ లోపం కనిపించింది. మహేష్ బాబు డైలాగ్స్ అర్థం కాలేదు. బీజీఎం డామినేట్ చేసిందని కొందరు కంప్లైంట్ చేశారు.

గుంటూరు కారం మూవీ నిరాశపరిచిన నేపథ్యంలో రెండో రోజు నుండే డ్రాప్ కనిపించింది. కొన్ని సెంటర్స్ లో అత్యల్ప టికెట్స్ తెగాయి. అనూహ్యంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒక షోకి కేవలం 37 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయట. ఎప్పుడూ రద్దీగా ఉంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఇంత తక్కువ టికెట్స్ అమ్ముడుపోవడం ఊహించని పరిణామం. మహేష్ బాబుకి ఇది అవమానం తప్పితే మరొకటి కాదనే టాక్ వినిపిస్తోంది.

వీకెండ్.. అందులోనూ పండగ దినాల్లో కూడా జనాలు గుంటూరు కారం మూవీ పట్ల ఆసక్తి చూపడం లేదని తేలిపోయింది. అయితే మేకర్స్ మాత్రం గుంటూరు కారం వసూళ్లు రూ. 200 కోట్లు దాటాయని చెబుతున్నారు. నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ బాగున్నాయని గుంటూరు కారం చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు చెప్పడం కొసమెరుపు. ఇక నేటి నుండి అసలు పరీక్ష మొదలవుతుంది.

పండగ దినాలు ముగిశాయి. వర్కింగ్ డే మొదలైంది. కాబట్టి ఇది వసూళ్లపై గట్టి ప్రభావం చూపుతుంది. ఫైనల్ రన్ ముగిసే నాటికి గుంటూరు కారం ఎంత రికవరీ చేస్తుందో చూడాలి. గుంటూరు కారం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.