https://oktelugu.com/

Hyundai Creta Facelift: మార్కెట్లోకి రాకముందే 4 నెలల వెయిటింగ్ పీరియడ్.. అంతగా ఏముంది ఈ కారులో?

దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో కార్ల కంపెనీ మధ్య తీవ్రమైన పోటీ పెరిగింది. అందుకు కారణం వినియోగం పెరగడమే. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి అద్భుతమైన డిజైన్ తో మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : January 17, 2024 / 10:44 AM IST

    Hyundai Creta Facelift

    Follow us on

    Hyundai Creta Facelift: కార్లలో తిరగాలని కలలు కనేవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ఆ కారును సొంతం చేసుకోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. అయితే నేటి కాలంలో తక్కువ బడ్జెట్ లో కార్లు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఆకట్టుకునే ఫీచర్స్, అద్భుతమైన డిజైన్ లతో అలరిస్తున్నాయి. కార్లు కొనాలనుకునేవారు ముందుగా బడ్జెట్ ను చూస్తారు. ఆ తరువాత ఫీచర్స్, డిజైన్ ను సెలెక్ట్ చేస్తారు. ఇటీవల ఓ కారు డిజైన్ చూసి కార్ల ప్రియులు ఇంప్రెస్ అవుతున్నారు. దీంతో ఈ మోడల్ మిగతా వాటిని తొక్కేసేవిధంగా ఉందని కొందరు అంటున్నారు. ఇంతలా ఆకట్టుకుంటున్న ఆ కారులో ఏముందో చూద్దాం..

    దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో కార్ల కంపెనీ మధ్య తీవ్రమైన పోటీ పెరిగింది. అందుకు కారణం వినియోగం పెరగడమే. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి అద్భుతమైన డిజైన్ తో మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా హ్యుందాయ్ కంపెనీ ఓ మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని డిజైన్ చూసి పిచ్చెక్కుతోందని కొందరు కామెంట్ చేయడం విశేషం. హ్యుందాయ్ కంపెనీ నుంచి జనవరి 16న రిలీజ్ అయిన క్రెటా ఫేస్ లిప్ట్ మార్కెట్లోకి రాకముందు నుంచే ఆదరణ పెరిగింది. ఈ ఏడాది జనవరి 2న దీని బుకింగ్స్ ప్రారంభం కాగా.. 14 రోజుల తరువాత 18 వారాల వెయిటింగ్ పీరియడ్ వచ్చింది. అంటే ఇప్పుడు కారు బుకింగ్ చేస్తే 4 నెలల వరకు ఆగాల్సిందే..

    ఈ నేపథ్యంలో అంతగా ఈ కారులో ఏముంది? అన్న చర్చ సాగుతోంది. క్రెటా ఫేస్ లిఫ్ట్ స్పెషిఫికేషన్ విషయానికొస్తే 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ అనే రెండు ఇంజిన్లు దీని ప్రత్యేకత. అలాగే 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్లను కలిగి ఉంది. 70 ప్లస్ సేఫ్టీ ఫీచర్స్, ఆల్లాయ్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. కొత్త ఎస్ యూవీ అయిన ఇందులో 10.25 ఇంచెస్ ట్విన్ డిస్ ప్లే ఇన్ఫోటైన్మెంట్, తిరిగి డిజైన్ చేసిన ఏసీ వెంట్ ఆకర్షిస్తుంది. ఇంకా 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, అప్డేట్ చేసిన సీట్ ఇంప్రెస్ చేస్తుంది.

    ఇదే తరహా ఫీచర్ల తో ఉన్న మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధర విషయానికొస్తే రూ.11 లక్షల ఎక్స్ షోరూం ప్రైస్ తో విక్రయిస్తున్నారు. ఇది మొత్తం 7 రంగుల్లో అందుబాటులో ఉంది. వీటిలో అట్లాస్ వైట్ విత్ బ్లాక్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, ఎమరాల్డ్ పెర్ల్ ఉన్నాయి. క్రెటాలో ఎల్ ఈ డీ సిస్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. దీని ముందు, వెనక ఉన్న హెడ్ ల్యాంపులను అమర్చారు. సరికొత్త బంపర్, షార్క్ ఫిన్ యాంటినా వంటికి కారుకు ఆకర్షణగా నిలిచాయి.