Ayodhya Airport: అయోధ్య.. అంతా రామమయంగా మారుతోంది.. జనవరి 22న అయోధ్య రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య పట్టణాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. ఆంతా రాముడే కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అయోధ్యకు రైలు, విమాన మార్గంలో వచ్చే భక్తుల కోసం ప్రత్యకంగా రైల్వే స్టేసన్, విమానాశ్రయాన్ని ఆధునికీకరించారు. వీటిని ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. 15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఆరు వందేభారత్ రైళ్లు..
దేశంలోని వివిధ నరగారాలకు కనెక్ట్ అయ్యే ఆరు వందే భారత్, రెండు అమృత్ భారత్ రైళ్లను కూడా మోదీ అయోధ్యలో ప్రారంభించనున్నారు. ఉదయం 11.15 గంటలకు రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. తర్వాత కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

రైల్వే స్టేషన్‌కు అయోధ్య ధామ్ జంక్షన్‌గా నామకరణం..
ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్ పరిసరాలన్నీ రామాయణంలోని కీలక ఘట్టాలను ప్రతిబింబించే విగ్రహాలు, చిత్రపటాలు ఏర్పాటు చేశారు. మూడు అంతస్తులతో రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించారు. దీనికి ఆయోధ్యధామ్ జంక్షన్‌గా నామకరణం చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇకపై రైళ్లు నడవనున్నాయి.

శ్రీరామ్ విమానాశ్రయం..
ఇక అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. దీనికి సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనికి శ్రీరామ్ విమానాశ్రయంగా పేరుపెట్టారు. ఈ విమానాశ్రయం నుంచి కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు నడుపుతారు. జనవరి 6 నుంచి విమానాలు నడిపేలా విమానయాన శాఖ చర్యలు తీసుకుంది. విమానాశ్రయంలో కూడా రామాలయానికి సబంధించిన ఘట్టాలు చెక్కారు.
