Dubbed Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు ఏ భాష నుంచి మంచి సినిమాలు వచ్చిన కూడా ఆ సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారనేది ఎప్పటినుంచే ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. అందుకే వేరే భాష చిత్రాల్లో స్టార్ హీరోలైన రజనీకాంత్, సూర్య, కమలహాసన్ లాంటి హీరోలు ఇక్కడ కూడా సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు నిజానికి కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ప్రతిసారి మంచి సినిమాలను హిట్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ఇక్కడ చాలామంది స్టార్ హీరోలు అయ్యారు ఇక ఇప్పుడు 2023 వ సంవత్సరంలో డబ్బింగ్ సినిమాల హవా కొంత వరకు సాగినప్పటికీ కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాపులుగా మిగిలాయి. మొదట జనవరిలో సంక్రాంతి కానుకగా విజయ్ నటించిన వారసుడు సినిమా రిలీజ్ అయింది. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా తమిళ్ సినిమానా,తెలుగు సినిమానా అనేది క్లారిటీ లేకుండా పోయింది. ముందుగా దిల్ రాజు ఇది తమిళ్ సినిమా అన్నాడు, సంక్రాంతి కానుక వస్తున్నప్పుడు తెలుగు సినిమా అని చెప్పాడు. దాంతో ఈ సినిమా ఈ భాష సినిమా అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని చెప్పాలి.
ఇంతకుముందు దర్శకుడు వంశీ పైడిపల్లి చేసిన బృందావనం, మహర్షి లాంటి సినిమాల రిఫరెన్సీతోనే ఈ సినిమా ఎక్కువగా కనిపించిందని ప్రేక్షకులు దీనిని ఫ్లాప్ గా మార్చారు… ఇక బాలీవుడ్ బాద్షా హీరోగా వచ్చిన పఠాన్, జవాన్ లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా తెలుగులో భారీ సక్సెస్ లను రాబట్టాయి. ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమా తనదైన రీతిలో అద్భుతాలను క్రియేట్ చేస్తూ డబ్బింగ్ సినిమాల్లో ఈ సంవత్సరం తెలుగులో భారీ సక్సెస్ అందుకుంది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణ్బీర్ కపూర్ కూడా అనిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక ఆ సినిమా కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయడం వల్ల ఈ సినిమా డబుడ్ సినిమాల్లో పెద్ద హిట్ సినిమా గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో డబ్బింగ్ సినిమాల్లో సూపర్ హిట్ అందుకున్న సినిమాగా ఈ సినిమా నిలిచింది…ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్యన్ సెల్వన్ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. అలాగే రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య లీడ్ తో లో వచ్చిన జిగురుతాండ డబుల్ ఎక్స్ , మార్క్ ఆంటోనీ లాంటి సినిమాలు ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాయి ఇక శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన మహావీరుడు కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయింది. ధనుష్ హీరోగా వచ్చిన సార్ సినిమా మాత్రం ఒక డీసెంట్ హిట్ గా నిలిచింది. తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిందనే చెప్పాలి…