Husband And Wife Relationship: భార్య భర్తల బంధం చాలా గొప్పది. ఎక్కడో పుట్టి ఒక చోట కలిసి పెళ్లి అనే బంధంతో ఒకే ఇంట్లో ఉంటూ జీవితాంతం ఒకరికోసం ఒకరు బతుకుతారు. ఎలాంటి సంబంధం లేకుండా పెళ్లి అనే బంధంతో ఒకటయ్యే జంటలు ఒకరికోసం ఒకరు కష్టపడుతూ అన్యోన్యంగా ఉంటారు. కష్టసుఖాలు పంచుకుంటూ జీవితాంతం తోడు నీడగా ఉంటారు. అయితే ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా, కోపంగా, అన్ని కలగలుపుకొని జీవించే దంపతులు కొన్ని విషయాలను మాత్రం ఒకరికి ఒకరు చెప్పుకోకూడదు. ముఖ్యంగా భర్త కొన్ని విషయాలను భార్య దగ్గర దాచాలి. మరి ఎలాంటి విషయాలు దాచుకోవాలో తెలుసుకుందామా..
భార్య భర్తల బంధం గురించి ఆచార్య చాణక్యుడు కొన్ని విషయాలు తెలిపారు. ఈయన చెప్పిన మాటల ప్రకారం కొన్ని విషయాలు భర్త భార్యతో పంచుకుంటూ తర్వాత దాని పరిమాణాలను అనుభవించే సమయం వస్తుందన్నారు. అయితే భార్యభర్తల సంబంధం రెండు శరీరాలని.. కానీ ఒకటే ఆత్మ లాంటిది. కానీ కొన్ని విషయాలు మాత్రం గోప్యంగానే ఉండాలి. బలహీనత గురించి ఎప్పుడు కూడా భాగస్వామితో పంచుకోకూడదు. ఎందుకంటే మీ బలహీనతను వారు కూడా ఒక వెపన్ లాగా ఉపయోగించే ఆస్కారం ఉంది.
అవమానం గురించి కూడా ఎప్పుడు భాగస్వామితో చెప్పుకూడదు. ఆ అవమానాన్ని గుర్తు చేసి చెడుగా మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇక ధానధర్మాలు కూడా రహస్యంగా ఉంచాలి. కుడి చేయితో ఇచ్చేది ఎడమ చేయి తెలియకుండా ఉంచాలంటారు. లేదంటే ఈ విషయం వల్ల భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇక ఎంత డబ్బు సంపాదిస్తున్నారు? ఎంత జీతం అనేది కూడా గోప్యంగా ఉంచాలి. లేకపోతే మీ ఖర్చులు కూడా మీరు సరిగ్గా చేసుకోలేరు. నిత్యావసరాలకు కూడా కష్టం అయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్ని విషయాలు భాగస్వామితో పంచుకోకుండా ఉండడమే మంచిది అంటారు చాణుక్యుడు.