Amrita Fadnavis: ఈ రోజుల్లో వార్డ్ కౌన్సిలర్లే మంత్రులుగా చలామణి అవుతున్నారు. వాహన శ్రేణి.. అనుచరులతో దందాలు సాగిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి కుటుంబ సభ్యుల వ్యవహారాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇలాంటి వ్యవస్థ ఉన్న మనదేశంలో ఓ ముఖ్యమంత్రి భార్య సాధారణ పౌరురాలిగా కనిపించారు. ఏమాత్రం హడావిడి చేయకుండా సమాజ సేవలో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ కొనసాగుతున్నారు. ముంబైలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఉత్సవాలు పూర్తి అయిన తర్వాత స్వామి వారి ప్రతిమలను ముంబైలోని సముద్రంలో నిమజ్జనం చేస్తుంటారు. నిమజ్జనం చేసే క్రమంలో చెత్తాచెదారం ఏర్పడుతూ ఉంటుంది. ముంబై బీచ్ లో నగరవాసులు జాగింగ్ చేస్తుంటారు. అక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఇక్కడ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న క్రమంలో అక్కడి పరిసరాలు చెత్తగా మారుతున్నాయి. దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ చెత్త పేరుకుపోవడంతో ముఖ్యమంత్రి భార్య అమృత ఫడ్నవిస్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.. ఇంకా కొంతమంది సామాజిక సేవ చేసే వారితో కలిసి అక్కడ చెత్తను శుభ్రం చేశారు. పేరుకుపోయిన వ్యర్ధాలను బస్తాలలో సేకరించి ముంబై నగరపాలక పారిశుధ్య వాహనాలలో తరలించారు.
అమృత సేవ కార్యక్రమాలు నిర్వహించడం కాదు. గతంలో అనేక కార్యక్రమాలను ఆమె చేపట్టారు. రక్తదానం.. ఇతర కార్యక్రమాలను ఆమె చేపట్టారు. కౌమార ఆడపిల్లల్లో వ్యక్తిగత శుభ్రత పెంపొందించడానికి ఆమె అనేక రకాలుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక స్వచ్చంద సంస్థను నెలకొల్పి.. సానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తున్నారు. ఇటీవల యోగా దినోత్సవం నిర్వహించిన క్రమంలో.. ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఇక సముద్ర తీర ప్రాంతంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు..” ముంబై నగరం మనందరిది . సముద్ర తీరం కూడా మనది. దీనిని కాపాడుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం స్వచ్ఛమైన వాతావరణం ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుందని” అమృత వ్యాఖ్యానించారు. అమృతతో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ఇతర సెలబ్రిటీలు పాల్గొన్నారు.
Leading social activist @fadnavis_amruta ji took up a beach cleaning campaign at Mumbai post the Ganesh Visarjan . A firebrand lady leading from the front is the symbol of modern India.
For all those who are aware of Amruta ji’s work, this is routine.pic.twitter.com/3huy5nuo2i
— पाकीट तज्ञ (@paakittadnya) September 7, 2025