Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ సీజన్ 9’ సరికొత్త గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది… ఈరోజు రాత్రి 7 గంటలకు స్టార్ మా లో మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వడానికి సిద్ధమవుతోంది. మరి ఇలాంటి క్రమంలోనే ఈ షో ని చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇప్పటివరకు ఏ షోకి దక్కని ఆదరణ ఇప్పుడు ఈ షోకు దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పటి వరకు సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఆ ఎనిమిది సీజన్లను మర్చిపోయే రేంజ్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను అందించడానికి సిద్ధమైంది. ఇక ఇందులో చాలా వరకు ట్విస్ట్ లు అయితే ఉన్నాయి.
ఇప్పుడు చాలా కొత్తగా ముస్తాబైన బిగ్ బాస్ సీజన్ 9 లో రెండు హౌస్ లు ఉన్నాయి. ఒకటి నార్మల్ హౌస్ కాగా, మరొకటి లగ్జరీ హౌస్ గా తెలుస్తోంది. ఇక దీనికి, దానికి వేరియేషన్స్ చూపిస్తూ కొంతమంది కంటెస్టెంట్స్ ను లగ్జరీ హౌస్ లో ఉంచే అవకాశాలైతే ఉన్నాయి… ఇక సెలబ్రిటీలు, కామనర్స్ ను కలిపి 15 మంది హౌస్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంది.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా చాలామంది సెలబ్రిటీలను భాగం చేయాలని చూస్తున్నారు. ఎక్కడైతే ఎపిసోడ్ డల్ అవుతుందో ఆ వీక్ లో ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి షో కి బుస్టాప్ ఇచ్చే ప్రయత్నం చేయడానికి రంగ సిద్ధం చేస్తున్నారు. ఇక దాంతో పాటుగా బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో ఒక వ్యక్తి ఒక బాక్స్ ని తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తానని చెప్పినప్పటికి బిగ్ బాస్ మాత్రం అలా కుదరదు అని చెప్పడంతో ఆయన నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పగా బిగ్ బాస్ సైతం మీ ఇష్టం అని చెప్పడంతో ఇంటికి వెళ్ళిపోయినట్టుగా మనకు చూపించారు.
నిజానికి ఆయన కొన్ని కండిషన్స్ తో మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికి అతని ఫేస్ కనబడకుండా బ్లర్ చేశారు. ఇక అతను వాయిస్ ని బట్టి అతని హైట్ ని బట్టి చూస్తే ఆయన సీరియల్స్ లో నటించే భరణి గారు అని తెలుస్తోంది… ఇలా మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది…