క్రెడిట్ కార్డును వాడుతున్నారా.. గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..?

దేశంలో రోజురోజుకు క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు సైతం బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డును వినియోగించే వాళ్లు క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ గురించి పెద్దగా పట్టించుకోరు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఎన్నో కీలక విషయాలు క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లో ఉంటాయి. క్రెడిట్ కార్డులో చెల్లింపులు, కొనుగోళ్లతో పాటు రివార్డ్ పాయింట్లు, క్రెడిట్ బ్యాలన్స్ ఇతర వివరాలు ఉంటాయి. […]

Written By: Navya, Updated On : January 13, 2021 3:16 pm
Follow us on

దేశంలో రోజురోజుకు క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరుగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు సైతం బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తున్నాయి. క్రెడిట్ కార్డును వినియోగించే వాళ్లు క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ గురించి పెద్దగా పట్టించుకోరు. క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఎన్నో కీలక విషయాలు క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లో ఉంటాయి. క్రెడిట్ కార్డులో చెల్లింపులు, కొనుగోళ్లతో పాటు రివార్డ్ పాయింట్లు, క్రెడిట్ బ్యాలన్స్ ఇతర వివరాలు ఉంటాయి.

క్రెడిట్ కార్డులోని లావాదేవీలను చూడటం ద్వారా ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగి ఉంటే సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు అవసరం లేని వస్తువులను కొన్ని సందర్భాల్లో కొనుగోలు చేస్తుంటారు. స్టేట్ మెంట్ ను పరిశీలించడం ద్వారా అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ ను పరిశీలిస్తే కార్డు ద్వారా జరిగిన మోసాలను గుర్తించడంతో పాటు రివార్డ్ పాయింట్లను సైతం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లో స్టేట్ మెంట్ గడువు తేదీతో పాటు చెల్లింపు గడువు తేదీలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులకు బ్యాంకును బట్టి గ్రేస్ పీరియడ్ లో మార్పులు ఉంటాయి. గ్రేస్ పీరియడ్ లోపు బిల్లు చెల్లిస్తే వడ్డీ పడదు.

క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లో చెల్లించాల్సిన కనీస మొత్తం, చెల్లించాల్సిన మొత్తం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ స్టేట్ మెంట్ లో లావాదేవీల వివరాలను పూర్తిగా తెలుసుకుంటే తక్కువ ఖర్చు చేసే వీలు ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా వచ్చే రివార్డ్ పాయింట్లను గడువులోగా రిడీమ్ చేసుకోవాలి. రివార్డు పాయింట్లను సరిగ్గా వినియోగించడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.