https://oktelugu.com/

ఫోన్ పోగొట్టుకున్నారా.. సులువుగా ట్రాక్ చేయడం ఎలా అంటే..?

దేశంలోని యువత, విద్యార్థులలో చాలామంది ఎక్కువ విలువ చేసే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురితే లేదో పోగొట్టుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. అయితే ఫోన్ ను పోగొట్టుకున్నా సులభంగా కనిపెట్టవచ్చు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పోయిన ఫోన్ ఎక్కడ ఉన్నా సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. స్విఛాఫ్ అయిన ఫోన్ ను కనిపెట్టడం కష్టమని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే స్విఛాఫ్ అయిన ఫోన్ ను కూడా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2021 / 08:30 AM IST
    Follow us on

    దేశంలోని యువత, విద్యార్థులలో చాలామంది ఎక్కువ విలువ చేసే స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురితే లేదో పోగొట్టుకుంటే ఇబ్బందులు పడక తప్పదు. అయితే ఫోన్ ను పోగొట్టుకున్నా సులభంగా కనిపెట్టవచ్చు. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పోయిన ఫోన్ ఎక్కడ ఉన్నా సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. స్విఛాఫ్ అయిన ఫోన్ ను కనిపెట్టడం కష్టమని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే స్విఛాఫ్ అయిన ఫోన్ ను కూడా సులభంగా కనిపెట్టవచ్చు.

    ఐఫోన్ యూజర్లు మీరు వాడే ఫోన్ ఐఫోన్ అయితే మొదట icloud.com వెబ్ సైట్ లోకి వెళ్లి find my iphone అనే ఆప్షన్ పై క్లిక్ చేసి సైన్ ఇన్ కావడం ద్వారా ఫోన్ లొకేషన్ తో ఉన్న మ్యాప్ ను చూడవచ్చు. ఆ మ్యాప్ సహాయంతో సులభంగా ఐ ఫోన్ ను కనిపెట్టవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు find my device అనే వెబ్ సైట్ లో ఫోన్ తో లింక్ అయిన జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయ్యి మెనూలో ఫోన్ ను ఎంపిక చేసుకుని లొకేషన్ ను తెలుసుకోవచ్చు.

    ఐఫోన్ స్విఛాఫ్ అయితే ఫోన్ లొకేషన్ ను ట్రాక్ చేసి నోటిఫై ఆప్షన్ ను ఎంచుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రం లొకేషన్ ఆఫ్ లో ఉంటే ఫోన్ ను కనిపెట్టలేం. ఐ ఫోన్ ను పోగొట్టుకుంటే icloud.com వెబ్ సైట్ ద్వారా lost mode iphone అనే ఆప్షన్ ను ఎంచుకుని సులభంగా ఫోన్ ను ట్రాక్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అయితే lock my phone అనే ఆప్షన్ ను డివైజ్ మేనేజర్ లో సెలక్ట్ చేసుకుని సులభంగా పోయిన ఫోన్ ను కనిపెట్టవచ్చు.

    ఈ టిప్స్ పాటించడం ద్వారా సులభంగా ఫోన్ ను కనిపెట్టవచ్చు. ఒకవేళ ఈ విధంగా ఫోన్ ను కనిపెట్టలేకపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఐ.ఎం.ఈ.ఐ నంబర్లను ఇచ్చి సులభంగా ఫోన్ ఎక్కడ ఉందో కనిపెట్టే అవకాశం ఉంటుంది.