https://oktelugu.com/

చరిత్ర సృష్టించిన కేజీఎఫ్2: 100 మిలియన్ వ్యూస్ దాటేశారు

కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్2’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా గురువారం రాత్రి యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. Also Read: పిల్లలే పెళ్లి పెద్దలుగా సింగర్ సునీత పెళ్లి రాకీ భాయ్ గా వచ్చిన యశ్ ఈ టీజర్ తో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించాడు. ఈ టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2021 / 10:17 PM IST
    Follow us on

    కేజీఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్2’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా గురువారం రాత్రి యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

    Also Read: పిల్లలే పెళ్లి పెద్దలుగా సింగర్ సునీత పెళ్లి

    రాకీ భాయ్ గా వచ్చిన యశ్ ఈ టీజర్ తో దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించాడు. ఈ టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో రికార్డులు బద్దలు కొట్టింది. అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్ లు దాటిపోయింది. కోటి వ్యూస్ ను అతి తక్కువలో అందుకోవడం అంటే అది దేశ సినిమా చరిత్రలోనే ఓ సంచలనమనే చెప్పొచ్చు. ఏకంగా 5 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం.

    ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్స్ లో ఈ ట్రైలర్ ఉంది. ఈ సందర్భంగా హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే ట్రైలర్ లోని డైలాగును ‘పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్.. కథ ఇప్పుడే ప్రారంభమైంది’ అని ట్వీట్ చేశారు.

    Also Read: ‘రియా చక్రవర్తి’ మళ్ళీ ప్రేమలో పడిందా ?

    చాప్టర్ 1లో మిగిలిన కథను చాప్టర్ 2లో చూపించబోతున్నారు. గరుడను చంపిన రాకీ ఆ తర్వాత కేజీఎఫ్ ను ఎలా సొంతం చేసుకున్నాడు.. శత్రువుల దాడిని ఎలా ఎదుర్కొన్నాడు? అధీర ఎలా తిరిగొచ్చాడు? భారత ప్రభుత్వం కేజీఎఫ్ ను ఎలా దక్కించుకుందనేది రెండో పార్ట్ లో చూపించబోతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్