Bheemla Nayak Closing Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత ఒక్క ఊర నాటు మాస్ రోల్ తో మన ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా కి టికెట్ రేట్స్ మరియు అదనపు షోస్ పెంచుకోడానికి అనుమతిని ఇవ్వకపోయినా కూడా అతి తక్కువ టికెట్ రేట్స్ తోనే ఈ సినిమా 100 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసి పవర్ స్టార్ స్టామినా ఏమిటో మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేసింది..ముఖ్యంగా ఈ సినిమాకి మొదటి వారం లో ఆంధ్ర ప్రదేశ్ లో అమ్ముడుపోయిన టికెట్స్ సంఖ్య బాహుబలి పార్ట్ 2 కంటే ఎక్కువ అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తన్న వార్త..ఆ స్థాయిలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామి ని సృష్టించింది..#RRR సినిమా మార్చి 25 వ తారీఖున విడుదల కాకపొయ్యి ఉంటె ఈ సినిమా కచ్చితంగా ఇంకా కొన్ని రోజులు లాంగ్ రన్ ఉండేది అని ట్రేడ్ వర్గాల అంచనా..దాదాపుగా బాక్స్ ఆఫీస్ రన్ మొత్తం క్లోజ్ కి వచ్చేయడం తో ప్రాంతాల వారీగా ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
నైజం ప్రాంతం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఖుషి సినిమా నుండి ఆయన ఈ ప్రాంతం లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో గా కొనసాగుతూన్నాడు..ఇక్కడ ఆయనకీ అత్యధిక ఫుల్ రన్ రికార్డ్స్ మరియు మొదటి అర్జు రికార్డ్స్ ఉన్నాయి..భీమ్లా నాయక్ సినిమాకి కూడా మొదటి రోజు ఆల్ టైం రికార్డు ఈ ప్రాంతం నుండి వచ్చింది..అంతే కాకుండా ఫుల్ రన్ లో ఈ సినిమా ఇక్కడ దాదాపుగా 36 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక రాయలసీమ ప్రాంతం లో ఈ సినిమా పై టికెట్ రేట్స్ ప్రభావం, మరియు బెన్ఫిట్ షోస్ లేని లోటు స్పష్టంగా కనపడింది అనే చెప్పాలి..పవన్ కళ్యాణ్ గత చిత్రం వకీల్ సాబ్ కరోనా పీక్ టైం లో వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతం లో దాదాపుగా 13 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..కానీ భీమ్లా నాయక్ మాత్రం 12 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది, ఒక్కవేల ఈ ప్రాంతం లో ఈ సినిమాకి అఖండ మరియు పుష్ప సినిమాలకు ఉన్నట్లుగా బెన్ఫిట్ షోస్ మరియు టికెట్ రేట్స్ ఉంది ఉంటె 15 కోట్ల రూపాయిల షేర్ ని ఒక్క రూపాయి కూడా తగ్గి ఉండేది కాదు అని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
Also Read: NTR కొడుక్కి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఇక పవన్ కళ్యాణ్ కి మంచి పట్టు ఉన్న ఉభయ గోదావరి రెండు జిల్లాలకు కలిపి ఈ సినిమా 11 కోట్ల రూపాయిలు వసూలు చేసింది అని అంచనా..100 రూపాయిల టికెట్ రేట్స్ మీద ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ సినిమా ఒక్క ప్రభంజనం సృష్టించింది అనే చెప్పాలి..ఈ ప్రాంతం లో ఇక్కడ ఈ సినిమా కేవలం 110 టికెట్ రేట్స్ మీద దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఒక్కవేల ఈ సినిమాకి టికెట్ రేట్స్ మంచిగా ఉంది ఉంటె కచ్చితం గా ఈ ప్రాంతం లో 16 కోట్ల రూపాయిలు వసూలు చేసి ఉండేది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఇక కృష్ణ , గుంటూరు మైర్యు నెల్లూరు వంటి జిల్లాల్లో కూడా ఈ సినిమా ఒక్క వారం రోజుల పాటు ఆగకుండా హౌస్ ఫుల్స్ అవుతూనే ఉన్నది..ఇటీవల కాలం లో #RRR మినహా ఏ సినిమాకి కూడా ఇలాంటి రన్ రాలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 105 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని అంచనా..ప్రభుత్వం విధించిన అతి తక్కువ టికెట్ రేట్స్ వల్ల ఈ సినిమాకి అదనంగా రావాల్సిన 40 కోట్ల రూపాయిల షేర్ బొక్క పడింది అని బయ్యర్లు చెప్తున్నారు..ఒక్కవేల ఈ సినిమాకి రేట్స్ ఉంది ఉంటె కచ్చితంగా 150 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసి ఉండేది అని అంచనా.
Also Read: జై చిరంజీవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ప్రస్తుతం ఏం చేస్తోంది?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Bheemla nayak closing collections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com