https://oktelugu.com/

అదిరిపోయే ట్వీస్ట్.. యువీ రిటైర్మెంట్ వాపస్..!

2007 ట్వీ-20 వరల్డ్ కప్.. 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలువడంలో యువరాజ్ సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. టీం ఇండియాలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్ లను యువరాజ్ గెలిపించాడు. బ్యాట్స్ మెన్ గానే కాకుండా బౌలింగ్.. ఫీల్డింగ్ లోనే యువరాజ్ సింగ్ సత్తాచాటేవాడు. దీంతో టీం ఇండియా ఆటగాళ్లలో బెస్ట్ ఆల్ రౌండర్ గా యువీ గుర్తింపు తెచ్చుకున్నాడు. Also Read: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. 2022 ప్రపంచ కప్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 16, 2020 10:44 am
    Follow us on

    2007 ట్వీ-20 వరల్డ్ కప్.. 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలువడంలో యువరాజ్ సింగ్ ప్రధాన పాత్ర పోషించాడు. టీం ఇండియాలో కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్ లను యువరాజ్ గెలిపించాడు. బ్యాట్స్ మెన్ గానే కాకుండా బౌలింగ్.. ఫీల్డింగ్ లోనే యువరాజ్ సింగ్ సత్తాచాటేవాడు. దీంతో టీం ఇండియా ఆటగాళ్లలో బెస్ట్ ఆల్ రౌండర్ గా యువీ గుర్తింపు తెచ్చుకున్నాడు.

    Also Read: క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. 2022 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది..!

    ఎడమచేతి బ్యాట్స్ మెన్ అయిన యువరాజ్ సింగ్ 2011 వన్డే ప్రపంచ కప్ లో మ్యాన్ ఆఫ్ ది సీరిస్ గా నిలిచాడు. భారత్ ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. అయితే 2019 జూన్ 10న యువరాజ్ సింగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన గ్లోబల్ టీ-20లీగ్ లో మాత్రమే ఆడాడు.

    యువీ రిటైర్మెంట్ నేపథ్యంలో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పునీత్ బాలి గత కొన్నేళ్లుగా యువరాజ్ ను తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడించాలని ప్రయత్నాలు చేశాడు. పలుమార్లు బీసీసీఐతో చర్చలు జరుపడంతో ఎట్టకేలకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో యువరాజ్ సింగ్ పంజాబ్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు.

    Also Read: బౌలర్లకు మద్దతుగా సచిన్ టెండూల్కర్ సంచలన కామెంట్స్..!

    యువీ తన రిటైర్మెంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు బయటికి ఇంకా తెలియలేదు. అయితే వచ్చే నెలలో జరుగబోయే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఎంపిక చేసిన 30మంది ప్రాబబుల్స్‌లో యువీ పేరు ఉండనుందని సమాచారం. త్వరలోనే దీనిపై పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో యువీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.