https://oktelugu.com/

అమరావతికి సోము వీర్రాజు జై.. జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిని మార్చేది లేదని.. అదే రాష్ట్ర రాజధాని అని తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. దీంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ ఇప్పుడు దీన్ని ఆయుధంగా వాడుకుంటోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని బూచీగా చూపి జగన్ ను టార్గెట్ చేసే పనిలో పడ్డారు. Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..? పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2020 / 09:17 PM IST
    Follow us on

    ఏపీ రాజధాని అమరావతిని మార్చేది లేదని.. అదే రాష్ట్ర రాజధాని అని తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. దీంతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. టీడీపీ ఇప్పుడు దీన్ని ఆయుధంగా వాడుకుంటోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని బూచీగా చూపి జగన్ ను టార్గెట్ చేసే పనిలో పడ్డారు.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..?

    పొట్టి శ్రీరాములు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం   కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి సోము వీర్రాజు జై కొట్టారని.. ఇప్పుడు జగన్ కు ఎందుకు నొప్పి అన్నట్టుగా నిలదీశారు.

    బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తుంటే సీఎం జగన్ మూడు రాజధానులంటూ వితండవాదన చేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.ఏడాదిగా అమరావతి కోసం రైతులు, మహిళలు పోరాడుతున్నారని చెప్పారు.  బీజేపీ కూడా అమరావతికి అనుకూలమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ కూడా రాజధాని అమరావతికి సుముఖంగా ఉన్నప్పుడు జగన్ కు అంత పట్టుదల ఎందుకని ఆయన నిలదీశారు.

    Also Read: ఏపీ హైకోర్టు సీజేను సిక్కింకు మార్చుతున్నారా?

    దీంతో సోము వీర్రాజు వ్యాఖ్యలను ఓన్ చేసుకొని చంద్రబాబు ఏకంగా జగన్ ను టార్గెట్ చేశారని అర్థం అవుతోంది. బీజేపీని తనతో కలుపుకొని అమరావతిపై చంద్రబాబు నయా రాజకీయం చేస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్