జగన్ చెప్పినా షర్మిల వినలేదు.. ఆమెతో వైసీపీకి సంబంధం లేదు: సజ్జల సంచలనం

వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోతున్న కొత్త పార్టీ ఆమె అన్నయ్య ఏపీ సీఎం జగన్ కు ఇష్టం లేదని.. షర్మిల చెప్పినా వినకుండా పార్టీ పెడుతున్నారని జగన్ సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. షర్మిల పార్టీపై వైసీపీ అధికారికంగా స్పందించినట్టైంది. తెలంగాణపై సీఎం జగన్ తో పాటు వైసీపీకి కూడా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయని సజ్జల సంచలన […]

Written By: NARESH, Updated On : February 9, 2021 6:01 pm
Follow us on

వైఎస్ షర్మిల తెలంగాణలో పెట్టబోతున్న కొత్త పార్టీ ఆమె అన్నయ్య ఏపీ సీఎం జగన్ కు ఇష్టం లేదని.. షర్మిల చెప్పినా వినకుండా పార్టీ పెడుతున్నారని జగన్ సన్నిహితుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కొత్త పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. షర్మిల పార్టీపై వైసీపీ అధికారికంగా స్పందించినట్టైంది.

తెలంగాణపై సీఎం జగన్ తో పాటు వైసీపీకి కూడా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాయని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తెలంగాణ పార్టీని ముందుకు తీసుకెళ్లడం లేదన్నారు. దీన్ని బట్టి వైఎస్ జగన్ తో విభేదించియే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు అర్థమవుతోంది.

తెలంగాణ విషయంలో వైసీపీ వైఖరి ఇప్పటికీ స్పష్టంగానే ఉందని ఆయన తెలిపారు. షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు తమకు ఇష్టం లేదనే అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది.

వైఎస్ షర్మిల చేస్తున్న ప్రయత్నాలకు తాము అభ్యంతరం తెలిపామని.. అయినా తాను వినలేదని సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ ఏర్పాటు కోసం తాను చేసిన ప్రయత్నాలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా సజ్జల వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఏపీ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే జగన్ భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు. అందుకే షర్మిలను కూడా కొత్త పార్టీ వద్దని కోరినట్లు ఆయన తెలిపారు. ఆమె మాట వినకుండా వెళ్తోందని సజ్జల అన్నారు.