https://oktelugu.com/

టీజర్ టాక్: రైతుల కష్టాలకు చెక్ పెట్టే ‘శ్రీకారం’

సినిమాల్లో చెప్పడానికే డైలాగులు ఉంటాయి.. చూపించడానికి రైతుల కష్టాలు ఉంటాయి.కానీ రైతుల సినిమాలు మాత్రం ఉండవు. కానీ ఇప్పుడు యువ హీరో శర్వానంద్ రైతు సబ్జెక్ట్ తో మన ముందుకు వస్తున్నారు. రైతుల ఘనతను చూపించేందుకు ‘శ్రీకారం’ చుట్టాడు. యువ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. నిజమైన రైతుల కష్టాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ లో చూపించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2021 / 06:31 PM IST
    Follow us on

    సినిమాల్లో చెప్పడానికే డైలాగులు ఉంటాయి.. చూపించడానికి రైతుల కష్టాలు ఉంటాయి.కానీ రైతుల సినిమాలు మాత్రం ఉండవు. కానీ ఇప్పుడు యువ హీరో శర్వానంద్ రైతు సబ్జెక్ట్ తో మన ముందుకు వస్తున్నారు. రైతుల ఘనతను చూపించేందుకు ‘శ్రీకారం’ చుట్టాడు.

    యువ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీకారం’. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. నిజమైన రైతుల కష్టాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ లో చూపించారు. 14 రీల్స్ పై రామ్ అచంట.. గోపీ అచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.

    ఈ ట్రైలర్ చూస్తే రైతుల కష్టాల చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తోంది. శర్వానంద్ ఇందులో యువ రైతుగా కనిపిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ‘శ్రీకారం’ పాటలు మోత మోగించాయి.

    తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీకారం’ ట్రైలర్ ను తన చేతులమీదుగా విడుదల చేశారు. ‘తినేవాడు నెత్తి మీద జుట్టంతా ఉంటాడు.. పండించే రైతులు మూతి మీద మీసం అంత ఉండరు’ అని శర్వానంద్ టీజర్ లోనే రైతుల దీనగాథ గురించి చెప్పుకొచ్చాడు. ఏ రైతు తన కొడుకు రైతు చేయడని.. తాను రైతుగా ఏం చేయాలో ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు అర్థమవుతోంది.

    *ట్రైలర్ ను కింద చూడొచ్చు.