అన్న జగన్ ఆంధ్రాకే.. తెలంగాణలో షర్మిల.. అసలు కథ ఇదే

వైఎస్ఆర్ కూతురు.. ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్ లోటస్ పాండ్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంతో క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్లయ్యింది? రాష్ట్రంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారంటూ పరోక్షంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది. విలేకరులతో మాట్లాడుతూ అన్న అయిన ఏపీ సీఎం జగన్ తో తనకు సంబంధం లేదని తేల్చేశారు. ఆంధ్రాలో జగన్ గారు […]

Written By: NARESH, Updated On : February 9, 2021 4:56 pm
Follow us on

వైఎస్ఆర్ కూతురు.. ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్ లోటస్ పాండ్ లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంతో క్లారిటీ ఇచ్చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నేళ్లయ్యింది? రాష్ట్రంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారంటూ పరోక్షంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది.

విలేకరులతో మాట్లాడుతూ అన్న అయిన ఏపీ సీఎం జగన్ తో తనకు సంబంధం లేదని తేల్చేశారు. ఆంధ్రాలో జగన్ గారు ఆయన పని ఆయన చేసుకుంటున్నారని.. తెలంగాణ కోసం తాను చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటున్నాని చెప్పారు.కొత్త పార్టీకి వైసీపీతో అనుబంధం ఉంటుందా లేదా అన్న దానిపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిపారు.

జగన్ కు వ్యతిరేకంగానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారన్న ప్రచారంపై షర్మిల తేల్చేశారు. అన్నతో తనకు ఎటువంటి విభేదాలు లేవని షర్మిల తేల్చేశారు.

అన్న ఆంధ్రాను ఏలితే తాను తెలంగాణను చూసుకుంటానని షర్మిల తన మాటల ద్వారా కుండబద్దలు కొట్టారు. దీన్ని బట్టి అన్నాచెల్లెలు దారులు వేరని అర్థమవుతోంది.

షర్మిల ఇప్పటికే ‘రాజన్న రాజ్యం’ అన్న పార్టీని ఈసీ దగ్గర రిజిస్ట్రర్ చేయించారని.. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తారని చెప్పినట్లు సమాచారం.